/rtv/media/media_files/2025/07/01/ram-charan-fans-mass-warning-to-producer-dil-raju-for-game-changer-movie-2025-07-01-19-55-49.jpg)
Ram Charan Fans mass warning to producer dil raju for game changer movie
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ రిజల్ట్‌తో నిర్మాతలు భారీగా నష్టపోయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఈ మూవీ ఫ్లాప్ అనంతరం నిర్మాత శిరీష్ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని అన్నారు.
కోట్ల రూపాయలు నష్టపోయామని.. అయినా రామ్ చరణ్ కానీ, దర్శకుడు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. హీరో లేదా దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అని అన్నారు. అలాగే ఈ మూవీ నిర్మాతల్లో మరొకరు అయిన దిల్ రాజు సైతం పలు ఇంటర్వ్యూల్లో ‘గేమ్ ఛేంజర్’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పాల్గొన్న ప్రతి ఈవెంట్, ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించే ప్రస్తావన తేవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇంకో సారి గేమ్ చేంజర్ గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
Ram Charan Fans
ఆ ప్రకటన ప్రకారం.. ‘‘ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక!. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకొనే మీరు.. ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికి అపాదించడం ఎంతవరకు సమన్యాసం.
ఖబడ్దార్ అంటూ హెచ్చరిక జారీ చేసిన రామ్ చరణ్ అభిమానులు.. ఇంకో సారి గేమ్ చేంజర్ గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.. - రామ్ చరణ్ ఫ్యాన్స్.. pic.twitter.com/Y8EOssN800
— H A N U (@HanuNews) July 1, 2025
Also Read : కొత్తిమీర కదా అని తక్కువ అంచనా వేయకండి.. దాంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి.
1 నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ, హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?
మైత్రీ బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?
సైంధవ్ ఫెయిల్ అయ్యాక.. ఆ నిర్మాత, వెంకటేశ్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేశ్ కి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా ? ఎక్స్ట్రా ఎమైనా ఇచ్చారా ?
“దర్శకుడు శంకర్ ఉన్నాడు’’ అని వెళ్లింది ఎవరు? “ఒక సంవత్సరం’’ అంటూ 3 సంవత్సరాలు వృథా చేసింది ఎవరు?
Also Read : ఏపీలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా?
మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి.. అది కూడా ఫ్లాప్ అయ్యింది అని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజూ ఇదే విషయం మీద మాట్లాడుతూ.. హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్‌లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురిచేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గాని, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవల్సి ఉంటుంది.’’ అంటూ ఆ ప్రకటనలో రాసుకొచ్చారు.
Also Read : ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ
Dil Raju | game-changer | latest-telugu-news | today-news-in-telugu | telugu-news