India-Oman: భారత్‌-ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం

ప్రధాని మోదీ జోర్డాన్, ఇథయోపియా, ఒమన్ దేశాల్లో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది.

New Update
India signs FTA with Oman

India signs FTA with Oman

ప్రధాని మోదీ జోర్డాన్, ఇథయోపియా, ఒమన్ దేశాల్లో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం (FTA) కుదిరింది. ఈ మేరకు ప్రధాని మోదీ సమక్షంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం (CEPA)పై భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ మంత్రి కియాస్‌ బిన్‌ మొహమ్మద్‌లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఇరుదేశాధినేతలు తెలిపారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఒమన్‌లో ఆ దేశ ప్రధాని సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో చర్చించారు. 

Also Read: ఓలా, ఊబర్ లకు టాటా..బైబై.. జనవరి నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ

వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వల్ తెలిపారు. భారత్-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని.. ఇదొ మైలరాయంటూ అభివర్ణించారు.  

ఒమన్ ప్రధాని సుల్తాన్‌ హైతమ్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం కోసం కృషి చేసినందుకు గాను ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ ప్రత్యేక పౌక పురస్కారమైన  ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’తో సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌.. ప్రధాని మోదీని సత్కరించారు. అయితే ఒమన్‌లో మోదీ పర్యటించడం ఇది రెండోసారి.

Also Read: రిటైర్మెంట్ ముందు సిక్స్ లు..న్యాయవ్యవస్థపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ డిసెంబర్ 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించారు. ముందుగా డిసెంబర్ 15-16  మధ్య జోర్డాన్‌కు వెళ్లారు. అక్కడ ఆ దేశ రాజు అబ్దుల్లా II తో మోదీ భేటీ సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధనం, నీటి వనరుల నిర్వహణపై ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు పెట్రా, ఎల్లోరా నగరాల మధ్య సాంస్కృతిక అనుసంధానం కుదిరింది. 

Advertisment
తాజా కథనాలు