BIG BREAKING: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన పెను ప్రమాదం!
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
హర్యానాలోని రేవారిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 6లోని నిలిపి ఉంచిన నాలుగు బస్సులు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. మంటలు త్వరగా పెరిగి నాలుగు బస్సులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది.
ఢిల్లీ నరేలాలో ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఇటుకలు, కత్తితో హత్య చేశారు. డ్రైవర్ నీతూను యజమాని మందలించడంతో ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నీతూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి మృతదేహం నిందితుడి గదిలో లభ్యమైంది.
మథుర జిల్లాలోని చౌముహన్ సమీపంలో ఆగ్రా-ఢిల్లీ మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సుమారు 12 బోగీలు బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 60 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'BSNL సమ్మాన్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. వృద్ధులకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ BSNL తీసుకువచ్చింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆరోగ్యం పై మరోసారి చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి సరిగాలేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లే ఆయన ప్రవర్తన ఉండటంతో విపక్షాలకు ఆయుధం దొరికినట్లవుతోంది.
ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ రిటైల్ వ్యాపారంలో రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా వస్తువుల విక్రయాలు, సేవల రంగం కలిపి మొత్తం రూ. 5.40 లక్షల కోట్లు దాటాయని, ఇది ఇండియన్ బిజినెస్ హిస్టరీలోనే అత్యధికమని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ప్రకటించింది.
మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం.
పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.