/rtv/media/media_files/2025/10/19/maoist-hidma-2025-10-19-11-32-28.jpg)
Hidma surrendered with 200 people?
Big breaking : మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం. సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూల్లో చదివి చిన్నవయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు.. ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుదిదశకు చేరుకున్నట్లేనని కేంద్రం భావిస్తోంది. భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా కీరోల్‌గా భావిస్తారు.
ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు
అయితే వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించి, ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏ మాత్రం అదరకుండా, బెదరకుండా పార్టీ లైనును కొనసాగిస్తున్న హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్‌గఢ్ పోలీసులు భావిస్తున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నారు దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరం ఘాటీ ఆంబుష్ వరకూ నేతృత్వం వహించింది హిడ్మాయేనని వారు చెబుతున్నారు. ప్రస్తుతం డీకేఎస్‌జడ్సీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మాతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి@దేవ్‌జీల పైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?
ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల ఎదుట ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్మూ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్‌లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా, ఆయన బెటాలియన్.. మే, జూన్‌లలో బసవరాజ్ సహా పలువురు నేతల ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టల పైకి వచ్చారని చెబుతున్నారు.అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో హిడ్మా ఉన్నట్లు సమాచారం. దీంతో కేంద్ర బలగాలు హిడ్మా లొంగిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన సహచరులతో చర్చిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. భద్రత బలగాలు మరోసారి ‘‘ఆపరేషన్ కర్రెగుట్టలు’’ను చేపట్టకముందే తన సహచరులతో కలిసి లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలంగాణలో లొంగిపోతారా లేక చత్తీస్ గఢ్ లో లొంగిపోతారా అనే అంశం పై తీవ్రంగా చర్చ సాగుతోంది. తన సహచరులను కోల్పోకముందే పోలీసుల ఎదుట లొంగిపోవడమే మంచిదన్న ఆలోచనలో హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?