Diwali Trade: దుమ్ముదులిపిన దీపావళి.. రికార్డ్ స్థాయిలో రూ.5.40 లక్షల కోట్ల కొనుగోళ్లు

ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ రిటైల్ వ్యాపారంలో రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా వస్తువుల విక్రయాలు, సేవల రంగం కలిపి మొత్తం రూ. 5.40 లక్షల కోట్లు దాటాయని, ఇది ఇండియన్ బిజినెస్ హిస్టరీలోనే అత్యధికమని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ప్రకటించింది.

New Update
Diwali 2025 sales

ఈ ఏడాది భారతదేశంలో దీపావళి పండుగ సీజన్ రిటైల్ వ్యాపారంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా వస్తువుల విక్రయాలు, సేవల రంగం కలిపి మొత్తం రూ. 5.40 లక్షల కోట్లు దాటాయని, ఇది ఇండియన్ బిజినెస్ హిస్టరీలోనే అత్యధికమని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ (CAIT) ప్రకటించింది. వినియోగదారులలో పెరిగిన స్వదేశీ సెంటిమెంట్‌, కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసరాలపై చేసిన జీఎస్టీ రేట్ల తగ్గింపులు. ఈ రెండు కారణాలతోనే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో రూ. 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువుల విక్రయాలు, రూ. 65,000 కోట్ల విలువైన సేవల అమ్మకాలు ఉన్నాయి.

గత ఏడాది రూ.4.25 లక్షల కోట్లుగా ఉన్న పండుగ సీజన్ అమ్మకాలతో పోలిస్తే, ఈసారి 25 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారుల విశ్వాసం పెరగడం, GST రేట్లలో చేసిన తగ్గింపులు, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే 'స్వదేశీ సెంటిమెంట్‌' బలంగా పనిచేయడం ఈ భారీ వృద్ధికి ముఖ్య కారణాలని CAIT వెల్లడించింది.

వస్తువుల అమ్మకాలు: మొత్తం విక్రయాల్లో 85 శాతం వాటా సాంప్రదాయ రిటైల్ దుకాణాలదే కావడం విశేషం. కిరాణా, FMCG (12 శాతం), బంగారం, ఆభరణాలు (10 శాతం), ఎలక్ట్రానిక్స్ (8 శాతం), గృహోపకరణాలు (7 శాతం) వంటి విభాగాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి.

సర్వీస్ సెక్టార్: లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, హోటల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు డెలివరీ నెట్‌వర్క్‌లు అదనంగా రూ. 65,000 కోట్ల వ్యాపారాన్ని అందించాయి. ఈ పండుగ ఉత్సాహం కారణంగా రవాణా, రిటైల్ సహాయక సేవల్లో సుమారు 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు కూడా లభించాయి.

దేశీయ ఉత్పత్తులకు ఈసారి రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వినియోగదారులు భారతదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో, దిగుమతి చేసుకున్న, ముఖ్యంగా చైనా వస్తువుల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. దేశీయ తయారీ ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా 25 శాతం పెరిగాయి. 'వోకల్ ఫర్ లోకల్' (స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం) స్ఫూర్తి చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా బలంగా నాటుకుందని ఇది నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు