వృద్ధులకు BSNL బంపరాఫర్.. 365 రోజుల అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ఎంతో తెలుసా?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 60 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'BSNL సమ్మాన్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. వృద్ధులకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ BSNL తీసుకువచ్చింది.

New Update
BSNL

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 60 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'BSNL సమ్మాన్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. వృద్ధులకు కమ్యూనికేషన్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ నూతన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ BSNL తీసుకువచ్చింది. ఇది కొత్త వినియోగదారుల కోసం పరిమిత కాల ఆఫర్‌గా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ కొత్త వినియోగదారులకు మాత్రమేనని BSNL ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

రూ.1812లకే 'సమ్మాన్ ప్లాన్'

ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు 365 రోజులు అన్‌లిమిటెడ్ రీచార్జ్‌ని అందిస్తుంది. దీని వలన వృద్ధులు తరచూ రీఛార్జ్ చేయవలసిన అవసరాన్ని ఉండదు. దేశవ్యాప్తంగా (స్థానిక, ఎస్‌టిడి, రోమింగ్) ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. రోజువారీ పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకు తగ్గుతుంది. రోజుకు 100 ఉచిత SMS కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. కొత్తగా BSNL కనెక్షన్ తీసుకునే సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి) ఉచిత SIM కార్డ్ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద ఆరు నెలల పాటు BiTV ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 18 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఎలా పొందాలి?
BSNL సమ్మాన్ ప్లాన్ ప్రస్తుతం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కొత్త సీనియర్ సిటిజన్ కస్టమర్‌ల కోసం ప్రచార ఆఫర్‌గా అందుబాటులో ఉంది. వినియోగదారులు దగ్గరలోని BSNL స్టోర్ లేదా అధీకృత డీలర్ వద్దకు తమ ఆధార్ కార్డ్‌తో వెళ్లాలి. కొత్త కనెక్షన్ తీసుకుని, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వృద్ధులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం పాటు కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడానికి BSNL తీసుకున్న ఒక మంచి చొరవగా చెప్పవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్ కాబట్టి, ఆసక్తి ఉన్న సీనియర్ సిటిజన్‌లు త్వరపడటం మంచిది.

Advertisment
తాజా కథనాలు