Boy Murder : తండ్రి చేసిన అవమానం.. 5ఏళ్ల కొడుకును కిడ్నాప్ చేసి ఇటుకలు, కత్తితో దారుణం..!

ఢిల్లీ నరేలాలో ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఇటుకలు, కత్తితో హత్య చేశారు. డ్రైవర్ నీతూను యజమాని మందలించడంతో ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నీతూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి మృతదేహం నిందితుడి గదిలో లభ్యమైంది.

New Update
Delhi Boy Kidnapped, Murdered By Father Driver

Delhi Boy Kidnapped, Murdered By Father Driver


దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. ఇటుకలు, కత్తితో అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఈ హత్యకు కక్ష సాధింపు చర్యే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రికి ఉన్న రవాణా వ్యాపారంలో పనిచేసే డ్రైవర్ నీతూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Delhi Boy Kidnapped

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3:30 గంటలకు బాలుడి కిడ్నాప్‌పై కాల్ వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణలో.. బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడని తెలిసింది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గాలించగా.. సమీపంలో ఉన్న నిందితుడు నీతూ అద్దె గదిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. 

అవమానమే హత్యకు కారణం:

ఈ ఘటనపై ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హారేశ్వర్ స్వామి మాట్లాడుతూ.. మృతుడి తండ్రికి ఏడెనిమిది రవాణా వాహనాలు ఉన్నాయి. అందులో నీతూ, వసీం అనే ఇద్దరు డ్రైవర్లు అతని వద్ద పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నీతూ, వసీం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నీతూ.. వసీంను కొట్టాడు. ఈ విషయం ట్రాన్స్‌పోర్టర్ అయిన బాలుడి తండ్రికి తెలియడంతో.. అతను జోక్యం చేసుకున్నాడు. 

ఈ క్రమంలో దురుసుగా ప్రవర్తించినందుకు నీతూను రెండు నుంచి నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన నీతూ.. బాలుడి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. మరుసటి రోజు మంగళవారం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి, తన అద్దె గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇటుకలు, కత్తి ఉపయోగించి బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

పారిపోయిన నిందితుడు 

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు డ్రైవర్ నీతూ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక నిఘా (టెక్నికల్ సర్వైలెన్స్), స్థానిక సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు