BIG BREAKING: ఘోర బస్సు ప్రమాదం.. 63 మంది స్పాట్ డెడ్!

పశ్చిమ ఉగాండాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఓవర్ టేక్ చేయబోయి  రెండు బస్సులు, మరో రెండు ఇతర వాహనాలు  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  

New Update
Uganda bus accident

Uganda bus accident

BIG BREAKING:  పశ్చిమ ఉగాండాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఓవర్ టేక్ చేయబోయి  రెండు బస్సులు, మరో రెండు ఇతర వాహనాలు  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగాండాలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవే అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  పశ్చిమ ఉగాండాలోని ఒక హైవేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 63 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు బస్సులు మరియు మరో రెండు వాహనాలు ఢీకొన్నాయి.

పెరుగుతున్న ప్రమాదాలు 

అయితే గత కొన్నేళ్లుగా  ఉగాండా తూర్పు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది.   అక్కడి రోడ్లు ఇరుకుగా ఉండడమే  ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసుల నివేదిక ప్రకారం.. 2024లో నమోదైన మొత్తం ప్రమాదాలలో 44% డ్రైవర్ల అజాగ్రత్త, అతి వేగం కారణంగానే జరిగినట్లు తెలిసింది.  ఉగాండా ప్రాంతంలో 2022 నుంచి 2024 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య గమనీయంగా పెరిగింది. 

2022 రోడ్డు ప్రమాదాలలో  4,534 మంది మరణించగా.. 2023లో.. 4,806, 2024లో  5,144 మంది మరణించారు. ఈ ప్రమాదాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.  ఈ ఏడాది ఆగస్టులో నైరుతి కెన్యాలో అంత్యక్రియల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ప్రయాణికులు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించగా. అనేక మందికి తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌

Advertisment
తాజా కథనాలు