/rtv/media/media_files/2025/05/19/hekn6ZZ5Q16DJWp3oZnk.jpg)
YouTuber Jyoti Malhotra
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఆమెను అతడు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
YouTuber Jyoti Malhotra’s Pahalgam Trip
అంతేకాదు ఆమెకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే జ్యోతి జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇటీవల గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరినైనా కలిశారా ? అక్కడ ఇంకా ఏమైన వీడియోలు తీశారా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
Also Read: ఇండియా పాక్ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు
rtv-news | telugu-news | national news in Telugu | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu