/rtv/media/media_files/2025/05/18/ZNQTi0B4jHxBH2eAgjd2.jpg)
SHAMELESS Shahid Afridi & Shoaib Akhtar
భారతదేశం చేతిలో చావుదెబ్బతిన్నపాకిస్థాన్‌కు ఇంకా బుద్ధిరాలేదు. పహల్గాంలో దొంగదెబ్బతీసి 26 మంది టూరిస్టుల మరణానికి కారణమైన పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసింది. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత రెచ్చిపోయిన పాకిస్థాన్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో క్షిపణులను ప్రయోగించింది. భారత్ దానికి ధీటుగా సమాధానమిచ్చింది. అయితే రెండు దేశాలు శాంతి ఒప్పందంతో యుద్ధం ఆగిపోయింది. కానీ పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. ఇంకా రెచ్చిపోతూనే ఉంది.
🚨BREAKING: Pakistani defeat celebration with SHAMELESS Shahid Afridi & Shoaib Akhtar. pic.twitter.com/ibej1tU720
— Manobala Vijayabalan (@ManobalaV) May 17, 2025
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
India-Pakistan War
కాగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. పలువురు ఉగ్రవాదులు, సైనికులు మరణించడంతో పాటు పాక్ కు చెందిన పలు ఎయిర్‌బేస్‌లు దెబ్బతిన్నాయి. ఉపగ్రహా చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. కానీ పాకిస్థాన్ దాన్ని ఒప్పుకోవడం లేదు.ఇండియా పై తామే గెలిచామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు ఇలా పెడితే అది వారి రాజకీయ అవసరాలకు అనుకోవచ్చు. కానీ ఇతర దేశాలతో స్నేహాన్ని కోరుకోవలసిన సెలబ్రిటీలు అలా ప్రవర్తించడం వారి దుర్భిద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఇద్దరూ కూడా ఇండియా పై గెలిచామని సంబురాలు చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
ఇండియా పాకిస్తాన్ యుద్దం ముగిసిన సందర్భంగా ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో ఈ సంబురాలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాదు ఇప్పటికే ఇండియా మీద గెలిచామని ఆఫ్రిది రోడ్ షో కూడా నిర్వహించాడు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల తీరుపై...సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చావుతప్పి కన్నులొట్టపోయినా ఇంకా బుద్ధి రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఇలా వేడుకలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
Also Read: అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం
Also Read : ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
shoaib-akhtar | shahid-afridi | pak-president | IND-PAK War | ind pak war