/rtv/media/media_files/2025/11/15/terror-2025-11-15-07-27-54.jpg)
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్(terror) తో సంబంధం ఉన్న నలుగురు వైద్యులపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు, ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు ఈ నలుగురు డాక్టర్ల పేర్లను ఇండియన్, నేషనల్ మెడికల్ రిజిస్టర్ల నుంచి తక్షణమే తొలగించాయి.
Also Read : జమ్మూ కశ్మీర్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
The National Medical Commission has removed the names of four doctors from the Indian/National Medical Register after an FIR was filed against them under relevant sections of the UAPA.
— durgeshkdubey (@ToolsTech4All) November 15, 2025
Those removed are:
Dr. Muzaffar Ahmad (Reg. No. 14680/2017)
Dr. Adeel Ahmad Rather (Reg. No.… pic.twitter.com/StI8W4YHg3
డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ ఈ నలుగురు వైద్యులు ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసుతో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్‌ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ డాక్టర్లంతా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ అయిన జైష్-ఎ-మొహమ్మద్ వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో భాగమని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Also Read : తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్ కుమార్ ఎవరు ?
వీరి నుంచి భారీగా
ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ నలుగురు డాక్టర్లు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వైద్య వృత్తిని నిర్వహించడానికి లేదా ఏదైనా వైద్య నియామకంలో కొనసాగడానికి పూర్తిగా అనర్హులు అని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ చర్య ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉన్నత విద్యావంతులైన నిపుణులపై ప్రభుత్వం తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా పరిగణిస్తున్నారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు (అమ్మోనియం నైట్రేట్), ఆయుధాలు, బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Follow Us