Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు

సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.

New Update
trump

ధరలపై పెరుగుదలపై అమెరికా అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనబడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల(trump tariffs) విషయంలో రాజీకి వచ్చారు. అత్యవసర వస్తువులపై టారిఫ్ లను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాఫీ - టీ, పళ్ళు, రసాలు, కోకో, సుగంధ ద్రవ్యాలు, అరటిపండ్లు, నారింజలు, టమోటాలు, గొడ్డు మాంసం, అవకాడోలు, కొబ్బరికాయలు, పైనాపిల్స్ మరికొన్ని నట్స్, ఎరువులపై సుంకాలను తీసేశారు. ఈరోజు నుంచే ఇవి అమల్లోకి వస్తాయని కూడా చెప్పారు .

Also Read :  మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌..

ధరల పెరుగుదలపై ప్రజల తిరుగుబాటు..

ఇటీవలి ఆఫ్-ఇయర్ ఎన్నికలలో ఓటర్లు ఆర్థిక వ్యవస్థను తమ ప్రధాన ఆందోళనగా చెప్పారు. దీని కారణంగానే రిపబ్లికన్లకు ఓటు వేయలేదు. వర్జీనియా, న్యూజెర్సీలలో ముఖ్యంగా అధికార పార్టీ ఓటమికి కారణమైంది. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి ఈక్వెడార్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ , అర్జెంటీనాతో కొత్త ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలను ప్రకటించిన తర్వాత ట్రంప్(Donald Trump) ఈ తొలగింపు ఉత్తర్వుపై సంతకం చేశారు. దిగుమతులను పెంచడానికి కాఫీపై సుంకాలను తగ్గిస్తామని వారం ప్రారంభంలోనే ట్రంప్ సూచించారు. దాంతో పాటూ అమెరికాలో పశువుల మంద బాగా తగ్గిపోయింది. దీని కారణంగా గొడ్డు మాంసం ధర బాగా పెరిగిపోయింది. దీని ప్రధాన ఎగుమతిదారు బ్రెజిల్ పై ట్రంప్ విధించిన సుంకాలు..గొడ్డు మాంసం కొరతను తీవ్రతరం చేయడమే కాక...రేట్లు పెరిగేలా చేసింది. అమెరికాలో ఉత్పత్తి చేయని వస్తువుల ధరలను తగ్గించే లక్ష్యంతో గురువారం అనేక లాటిన్ అమెరికన్ దేశాలతో ఒప్పందాలను ప్రకటించిన తర్వాత ఈ సుంకాల ఉపసంహరణ కూడా ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్.

Also Read :  Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

Advertisment
తాజా కథనాలు