/rtv/media/media_files/2025/11/20/tejashwi-yadav-2025-11-20-18-38-49.jpg)
Tejashwi yadav breaks silence after Bihar loss, congratulates new CM Nitish
బిహార్ ఎన్నిక(bihar-assembly-elections) ల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోరంగా పరాజయం పొందింది. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(tejashwi-yadav) స్పందించారు. కొత్తగా ఏర్పడ్డ ఎన్డీయే సర్కార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు కుడా అభినందనలు తెలియజేశారు. బీహార్ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చి బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలంటూ కోరారు. ఇదిలాఉండగా గురువారం నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక
Tejashwi Yadav Breaks Silence After Bihar Loss
ఆయనతో పాటు విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరీతో సహా పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. విజయ్, సామ్రాట్‌కు ఎన్డీయే కూటమి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
Also Read: చెప్పి మరీ దెబ్బ కొట్టాం..ఢిల్లీ పేలుళ్ళపై పాకిస్తాన్ నేత షాకింగ్ కామెంట్స్
బీహార్‌లో 243 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 89 సీట్లలో గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. గురువారం నితీశ్‌కుమార్‌తో సహా 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీళ్లలో 14 మంది బీజేపీ, 9 మంది జేడీయూ, ఇద్దరు లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్) నేతలు ఉన్నారు. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక విపక్ష కూటమి అయిన మహాగఠ్‌బంధన్ ఈ ఎన్నికల్లో కేవలం 35 స్థానాలకే పరిమితమయ్యింది. అందులో ఆర్జేడీ 25 స్థానాల్లో గెలిచింది.
Follow Us