Rahul Gandhi : ఓటర్ల జాబితా దేశ సంపద.. బీజేపీకోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఎందుకు చూపించడం లేదనిరాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

ఓటర్ల జాబితా(Voter List) దేశసంపద అని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఎందుకు చూపించడం లేదనిరాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. గురువారం ఢిల్లీ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. 

Also Read:భారత్‌ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలి.. శశిథరూర్

EC Stealing Votes For BJP Rahul Gandhi

ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని రాహుల్‌గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర(Maharashtra) లోనూ ఊహకందని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు.  ‘‘మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు. ఐదేళ్లలో నమోదైన వారి కంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నూతనంగా నమోదయ్యారని రాహుల్‌ వివరించారు. ఓటర్ల జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది. అది దేశ సంపద.. దానిని ఎందుకు చూపించట్లేదు. ’’ అని రాహుల్‌గాంధీ సీరియస్‌గా  ప్రశ్నించారు. 

బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని గతంలో ప్రకటించిన రాహుల్‌ గాంధీ మరోసారి అదే అరోపణ చేశారు. బీహార్‌ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలి. కర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయని రాహుల్‌ ఆరోపించారు.ఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్‌ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయి. 0 ఇంటి నెంబర్‌తోనూ వందల ఓట్లు ఉన్నాయి. సింగిల్‌ బెడ్రూం ఇంటిలో 48 ఓట్లు ఉన్నాయి. ఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్‌ లాంటి ఆధారాలున్నాయని రాహుల్‌ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:MP అత్యాచార కేసులో ఫాంహౌస్‌లో దొరికిన ఆ చీర కీలకం

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు ఉన్నాయని రాహుల్‌ ఆరోపించారు.మహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందన్నారు. జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. పోలింగ్‌నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్‌ జరిగిందన్న ఆయన పోలింగ్‌ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు.మహారాష్ట్ర ఓటర్‌ జాబితాలో ఫేక్‌ ఓటర్లను చేర్చారా? అని రాహుల్‌ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. 

బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈవీఎం(EVM Tampering) లతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాం. హర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా తప్పుతున్నాయి.అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయి అని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నామని రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టిన ఈసీ  కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేర్చిందని రాహుల్‌ ఆరోపించారు. అసలు విషయం ఏంటని మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడిందన్నారు. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్‌ బాంబు లాంటి ఆధారాలను గుర్తించామని తెలిపారు. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని హెచ్చరించారు. ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదని. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదని రాహుల్‌  హెచ్చరించారు. అధికారులు రిటైర్‌ అయినా కూడా వదిలేది లేదన్నారు.. వారు ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది.

bihar | evm-tampering | Madhya Pradesh | national news in Telugu | latest-telugu-news | telugu-news

Advertisment
తాజా కథనాలు