KTR : నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి కట్టబెట్టారని ఆరోపించారు.