/rtv/media/media_files/2025/08/07/congress-mp-shashi-tharoor-2025-08-07-15-12-44.jpg)
Congress MP Shashi Tharoor
భారత్‌పై ఇప్పటికే ట్రంప్ 25 శాతం సుంకాలు(donald trump tariffs) విధించగా... తాజాగా మరో 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మొత్తం 50 శాతం సుంకాలు విధించడం దుమారం రేపుతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనిపై కౌంటర్ ఇచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా ట్రంప్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(shashi-tharoor) ఈ వ్యవహారంపై స్పందించారు. ట్రంప్ సుంకాలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read: ఓటర్ల జాబితా దేశ సంపద.. బీజేపీకోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
India Should Retaliate On 50% Trump Tariffs
అమెరికా(usa) దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. గురువారం పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. '' అమెరికా భారత్‌పై విధించిన సుంకాలు మనపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. దాదాపు 90 బిలియన్ డాలర్ల వరకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. సుంకం ఎక్కువగా ఉంటే భారత వస్తువులు కొనడంపై కొనుగోలుదారులు సందేహిస్తున్నారు. చైనా.. రష్యా నుంచి భారత్ కన్నా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాకు మాత్రం ట్రంప్ సుంకాల నుంచి 90 రోజుల రిలీఫ్ ఇచ్చారు. కానీ మనకు మాత్రం కేవలం మూడు వారాలే ఉపశమనం కల్పించారు. ఇది కరెక్ట్ రాదు.
Also Read: ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
అందుకే కేంద్రం కూడా అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకం విధించాలి. వేరే ఇతర దేశం మనపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని'' శశిథరూర్ అన్నారు. ఇదిలాఉండగా ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు రకాల వస్తువులకు దెబ్బ పడనుంది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఆక్వా రంగం, ఆభరణాలు తదితర ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది.
Also Read: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి
ట్రంప్ విధించిన సుంకాలపై ఎట్టకేలకు ప్రధాని మోదీ(PM Modi) కూడా స్పందించారు. రైతు ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యక్తిగతంగా ఎంత వరకైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతులను సాకుగా చూపిస్తున్నారని అన్నారు. కానీ అసలు విషయం అది కాదని చెప్పారు. ఇంతకుముందు కూడా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా అమెరికా డెయిరీ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పారు. కానీ దానికి తాము నిరాకరించినట్లు పేర్కొన్నారు. అలాగే చేస్తే దేశంలో రైతులకు పెద్దఎత్తున నష్టం చేకూరుతుందని అందుకే దీనికి ఒప్పుకోలేదని తెలిపారు. దీనిపై వచ్చిన విభేదాలతోనే ట్రంప్ భారత్‌పై సుంకాలు పెంచుతున్నట్లు తెలుస్తోందని మోదీ చెప్పారు.
Also Read: భారత్‌పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
national news in Telugu | latest-telugu-news | telugu-news | rtv-news