Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

ఉత్తరాఖండ్‌లో (ఈరోజు) జనవరి 27 నుంచి యూనిఫాం సివిల్ కోర్డ్ అమలులోకి వచ్చింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి తన పేరును UCC పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. UCCతో మారనున్న 29పేజీల PDF రూల్స్ కాపీని విడుదల చేశారు. ఇండియాలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్.

author-image
By K Mohan
New Update
UCC act

UCC act Photograph: (UCC act)

Uniform Civil Code: భారతదేశమంటేనే విభిన్న సంస్కృతులు, వింత ఆచారాలు, అనేక మతాలు, కట్టుబాట్లు.. అందుకే మనదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇన్ని విషయాలు వేరైనా అందరికి రాజ్యాంగమే డిక్టేటర్. కులమేదైనా.. మతమేదైనా.. కట్టుబాట్లు ఏవైనా సరే చట్టం అందరినీ ఒకే గొడుకు కిందకి తీసుకొస్తోంది. ఇన్ని రోజులు వివాహం, విడాకులు, వారసత్వ ఆస్తి, దత్తత వంటి విషయాల్లో క్రైస్తవులు, ముస్లీంలు, హిందువులు ఎవరి మతాచారాల, గ్రంథాల ప్రకారం వారి కట్టుబాట్లను ఫాలో అయ్యేవారు. ఈ సిస్టమ్‌కు ఉత్తరాఖాండ్ రాష్ట్రం బ్రేక్ వేసింది. ఎవ్వరైనా సరే UCC చట్టం ప్రకారమే విడాకులు, పెళ్లి, దత్తత, లివ్‌ఇన్ రిలేషన్‌షిప్, వారసత్వం ఆస్తి పంపకాలు. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అమలు చేయాలని ఆలోచిస్తోంది. అసలు ఇది సాధ్యమేనా? ఇండియాలో కట్టుబాట్లు, సంస్కృతులు ప్రధాన్యతనిచ్చే ప్రజలు వాటిని మార్చుకుంటారా? యూనిఫాం సివిల్ కోడ్‌‌లో ఏం మారబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..

Also Read: Mauni Amavasya: మౌని అమావస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత ఇవి వ్యక్తిగత విషయాలు. ఏ మతం, కులం వాళ్లు ఆ సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు పాటించేవారు. ఉత్తరాఖాండ్‌లో ఇకపై లింగ, మత, కుల తేడాలు లేకుండా ఒకే రూల్స్ పాటించాలి. అదే యూనిఫాం సివిల్ కోడ్. ఇన్ని రోజులు ఇండియాలో ఇతర రాష్ట్రాలతోపాటు ఉత్తరాఖాండ్‌లో పెళ్లి, విడాకులు విషయాల్లో హిందువులు హిందూ వివాహ చట్టం 1955, వారసత్వం, దత్తత కోసం వారసత్వ చట్టం 1956లోని నిబంధనలు పాటించేవారు. క్రైస్తవులకు ఇండియన్ క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్1872, పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలకు ముస్లీలు షరియత్ లా ఫాలో అవుతారు. ఇలా ఎవరి చట్టాలు వారి మతాచారాల, మతగ్రంథాల ప్రకారం తయారు చేసుకున్నారు.

Also Read: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్

2025 జనవరి 27 నుంచి ఉత్తరాఖాండ్‌ రాష్ట్రంలో ప్రజలందరికి పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో ఒకే చట్టం, సేమ్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్‌ను ఉత్తరాఖాండ్‌లో అమలు చేసింది. ఉత్తరాఖండ్ భారతదేశంలో UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. 2024 ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత ఫిబ్రవరి 7న అసెంబ్లీ మెజారిటీతో ఆమోదించింది. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు.

Also Read: Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

రాష్ట్రాలు చట్టాలు తయారు చేయోచ్చా..?

భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. దేశంలో 1970 నుంచి రాష్ట్రాలు తమ సొంత చట్టాలను తయారు చేసుకుంటున్నాయి. ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈశాన్య భారత్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాలు తమ సొంత చట్టాలు పాటిస్తున్నాయి. గోవాలో 1867 నాటి ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. అక్కడి అన్ని కమ్యూనిటీలకు ఇది వర్తిస్తుంది. కానీ, కేథలిక్ క్రిస్టియన్లతో పాటు ఇతర కమ్యూనిటీలకు వేరే నియమాలు అమల్లో ఉన్నాయి. ఇప్పటికీ గోవాలో హిందువులు రెండు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. 

Also Read: UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

UCC వెబ్‌సైట్‌లో రిజిస్టరైన సీఎం పుష్కర్ సింగ్ ధామి

యూనిఫాం సివిల్ కోడ్ ప్రకారం.. సోమవారం ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి తన పేరును UCC పోర్టల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. UCCతో మారనున్న 29పేజీల PDF రూల్స్ కాపీని విడుదల చేశారు. వివాహాలు, విడాకులు, లైవ్-ఇన్ రిలేషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఆయన ప్రారంభించాడు. యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోని చేయలేదని పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. చెడు పద్ధతులను, మహిళల పట్ల వివక్షను అంతం చేయడానికే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేశామని ఉత్తరాఖండ్ సీఎం చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో మారనున్న రూల్స్ ఏంటి..?

లివ్ఇన్ రిలేషన్షిప్ నియమాలు: లివ్ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 18 నుంచి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భాగస్వాములకు, తల్లిదండ్రుల పర్మిషన్ అవసరం.

మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: దీంతో ఏమతం వారైనా వివాహాన్ని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అందరికీ ఒకే విధంగా విడాకులు: కులం లేదా మతం ఆధారంగా వివక్ష చూపకుండా అన్ని వర్గాలకు ఒకే విడాకుల చట్టం వర్తిస్తుంది.

మినిమమ్ మ్యారేజ్ ఏజ్: అన్ని మతాలు, కులాల బాలికలకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు నిర్ణయించబడింది.

దత్తత తీసుకునే సమాన హక్కులు: దత్తత అన్ని మతాలకు తెరిచిన విషయం అయినప్పటికీ, ఒక మతం నుంచి మరో మతం పిల్లలను దత్తత తీసుకోవడం నిషేధం

ఆచారాల రద్దు: హలాలా, ఇద్దత్ వంటి కొన్ని ఆచారాలు ఇకపై రాష్ట్రంలో అనుమతించబడవు.

ఏకపత్నీవ్రతం: మొదటి జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో వివాహం అనుమతించబడదు.

సమాన వారసత్వ హక్కులు: కుమారులు, కుమార్తెలు వారసత్వంలో సమానంగా హక్కులు పొందుతారు

లివ్ఇన్‌ రిలేషన్‌షిప్‌లో పుట్టిన పిల్లలకు హక్కులు: లివ్ఇన్‌ రిలేషన్‌షిప్‌ నుంచి జన్మించిన పిల్లలకు వివాహిత జంటల పిల్లలతో సమానమైన హక్కులు ఉంటాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు