/rtv/media/media_files/2025/01/27/jfcam41v1oII6mcgDgSP.jpg)
ucc
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
Also Read: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
ఈ చట్టం అమలు పై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇందులోని కీలక అంశాలు ఏంటంటే!
వివాహం ,విడాకులు,ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్ లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.
సహ జీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీ లో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్న వారు ఇక పై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.ఇందుకోసం ప్రభుత్వం తరుఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.సైనికులు , వాయుసేనలో పని చేస్తున్నవారు , యుద్దంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
Also Read:Siraj: ఆమె నాకు చెల్లెలులాంటి..నన్ను వదిలేయండి..మహ్మద్ సిరాజ్
అన్ని మతాలకు చెందని స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.అన్ని మతాల్లో బుహు భార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానం పై నిషేధం విధించారు.
యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కార్ పెద్ద కసరత్తు చేసింది. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. ఆ కమిటీ ఏడాదిన్నర పాటు కసరత్తులు చేసి సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీరించారు.
2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెల రోజుల తరువాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. తదుపరిగా యూసీసీ బిల్లు అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 చివర్లో రాష్ట్ర సర్కారుకు నివేదిక సమర్పించింది.
దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అదికారాన్ని సీఎం ధామికి కట్టబెడుతూ తీర్మానం చేసింది.
Also Read: 'నా ఉద్యోగం పోయింది, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది'.. సైఫ్ కేసులో అరెస్టయిన బాధితుడి ఆవేదన