Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో బైడెన్‌ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదం తెలిపారు.

New Update
Trump

America President Trump

గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో జో బైడెన్‌ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయేల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు మీడియాకు వెల్లడించినట్లు సమాచారం.

Also Read: Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హై రిస్క్‌ వార్నింగ్‌..!

దీని ప్రకారం రాబోయే రోజుల్లో దాదాపు 18 వందల ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్‌కు అందజేయనున్నట్లు తెలుస్తుంది. వీటిని బంకర్‌ బస్టర్లు అని కూడా పిలుస్తారు. నిషేధాన్ని ఎత్తివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే టెల్‌అవీవ్‌కు పెంటగాన్‌ ప్రతినిధులు తెలియజేశారు.

Also Read: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

గాజాలోని జనావాసాలపై ఈ బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్నట్టు ఆందోళనలు వ్యక్తం కావడం.. ఇదే సమయంలో అమెరికాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వీటి సరఫరాపై జో బైడెన్ నిషేధం విధించిన సంగతి తెలిసందే. దీంతో అవి గౌడొన్లకే పరిమితం అయ్యాయి. ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బాంబులను తామే స్వయంగా తయారుచేసుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులకు అప్పగించింది. నిజానికి గతంలో అమెరికాయే దాదాపు 10,000కుపైగా ఎంకే-84లను ఇజ్రాయెల్‌కు అందజేసింది.

బాంబులపై నిషేధం ఎత్తేసిన విషయాన్ని ట్రంప్ సైతం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. ‘‘ఇజ్రాయెల్ ఆర్డర్ చేసి, నగదు చెల్లించినా బైడెన్ అందజేయని చాలా వస్తువులు ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నాయి’ అని తెలిపారు. ఇంతకు మించి ఆయన ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. ఇక, అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబారి మైక్‌ హెర్జోగ్‌ ఇటీవల మాట్లాడుతూ... బైడెన్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇప్పుడిప్పుడే పరిస్థితులు...

ఈ నేపథ్యంలో ఎంకే-84 సరఫరాను పునరుద్ధరిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం గతవారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత 16 నెలలుగా కొనసాగుతోన్న కాల్పులు మోతతో దద్దరిల్లిన గాజాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థల నుంచి మానవతాసాయం కింద సామాగ్రి తరలివెళ్తోంది. అలాగే, హమాస్ తమ చెరలోని బందీలను ఒక్కొక్కరిగా వదిలిపెడుతుంటే.. దీనికి బదులుగా తమ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. 

Also Read: Siraj: ఆమె నాకు చెల్లెలులాంటి..నన్ను వదిలేయండి..మహ్మద్ సిరాజ్

Also Read: IST: కేంద్రం సంచలన నిర్ణయం.. అందరూ ఆ సమయాన్ని పాటించాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు