/rtv/media/media_files/2025/09/01/income-tax-2025-09-01-15-41-45.jpg)
Uttar Pradesh shopkeeper stunned by 141 crores tax notice, says PAN misused for shell firms
ఉత్తరప్రదేశ్(uttarpradesh) లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి(Shop Keepers) ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బులంద్‌షహర్ ప్రాంతంలో సుధీర్ అనే వ్యక్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతడికి ఇటీవల రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను విభాగం అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో అతడు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. తన పాన్‌కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి.. ఢిల్లీలో ఆరు కంపెనీలు నడుపుతున్నట్లు ఫిర్యాదు చేశాడు.
Also Read: తాకట్టు పెట్టిన 25 తులాల బంగారంతో బెట్టింగ్.. మంచిర్యాల SBI మేనేజర్, క్యాషియర్ నిర్వాకం!
Income Tax Notices To Shopkeepers
అంతేకాదు 2022లో కూడా తనకు అసలు సంబంధం లేని అమ్మకాలపై CGST కార్యాలయం నుంచి నోటీసు అందినట్లు తెలిపాడు. ఆ కంపెనీలతో తనకు సంబంధం లేదని ఆ సమయంలోనే ఇన్‌కమ్ ట్యాక్స్(income-tax) అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నాడు. మళ్లీ ఈ ఏడాది జులై 10న.. తాను రూ.141 కోట్లకు పైగా అమ్మకాలు చేసినట్లు ఇంకో నోటీసులు వచ్చిందని తెలిపాడు. ఈ నోటీసులో తన పేరు, చిరునామా, పాన్ నెంబర్‌తో పాటు, ఢిల్లీలో ఆరు కంపెనీలు నడుపుతున్నట్లు ఉందని వాపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!
మరోవైపు ఇలాంటి ఘటనలు జరగడానికి గల కారణాలను అధికారులు వివరించారు. కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు, రుణాలు తీసుకునేందుకు లేదా పన్నులు ఎగ్గొట్టేందుకు చట్టవిరుద్ధంగా మరో వ్యక్తి పాన్ వివరాలను వాడుతుంటారని పేర్కొన్నారు. అందుకే ఎవరూ కడా తమ పాన్‌కార్డు వివరాలు ఇతరులకు చెప్పొద్దని, త్రమ క్రెడిట్ రిపోర్టులు కూడా ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలని సూచనలు చేశారు .
#बुलंदशहर में सुधीर परचून की छोटी से दुकान करते है. इनकम टैक्स ने उन्हें ₹141.38 करोड़ की टैक्स चोरी का नोटिस भेजा है
— Narendra Pratap (@hindipatrakar) August 31, 2025
पुलिस के मुताबिक उनके आधारकार्ड का इस्तेमाल करके दिल्ली में 6 कंपनियां बनाई गई और अरबों का कारोबार दिखाया गया
सुधीर ने अपनी जान बचाने के लिए कंपनियों पर केस… pic.twitter.com/BLZkVJfqic
#Bulandshahr
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) September 1, 2025
दुकानदार को आयकर का नोटिस
1.41 अरब की टैक्स चोरी का नोटिस
खुर्जा नगर कोतवाली क्षेत्र की घटना
नोटिस मिलने पर सदमे में परिवार #IncomeTaxNotice#TaxEvasion#ZeeUPUK@shukladeepali15pic.twitter.com/Bcv7cKelwH
Also Read: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం: 500 మందికి పైగా మృతి
పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయడం వల్ల ఇలాంటి మోసాలను నిరోధించవచ్చని చెప్పారు. ఇదిలాఉండగా ఇటీవల యూపీకి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కూడా రూ.34 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. ఈ మధ్య ఇలా పేద, చిరువ్యాపారులకు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను నోటీసులు వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. బ్యాంకు ఖాతా, పాన్ వివరాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు .
Also Read: అద్దెకు అమ్మమ్మ తాతయ్యలు.. డబ్బు కొట్టు రిలేషన్ పట్టు