Ramlal Old Age Home: అద్దెకు అమ్మమ్మ తాతయ్యలు.. డబ్బు కొట్టు రిలేషన్ పట్టు

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని "రామ్‌లాల్ వృద్ధాశ్రమం" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

New Update
Ramlal old age home in Agra

Ramlal old age home in Agra

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రా(agra) లోని "రామ్‌లాల్ వృద్ధాశ్రమం(Ramlal old age)" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అద్దెకు తాతయ్య, అమ్మమ్మ' అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతిని అందిస్తుంది.

Also Read :  వామ్మో.. చిరువ్యాపారికి రూ.141 కోట్ల పన్ను నోటీసు

Ramlal Old Age Home In Agra

ఈ కార్యక్రమం కింద వృద్ధాశ్రమంలోని వృద్ధులను(Renting Parents) నెల రోజుల పాటు కుటుంబాలు తమతో పాటు ఉంచుకోవచ్చు. దీని కోసం కుటుంబాలు రూ.11వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన మొత్తంలో సగం అద్దెకు వెళ్లిన వృద్ధుడికి, మిగిలిన సగం ఆశ్రమానికి కేటాయిస్తారు. ఇలా అద్దెకు వెళ్లే వృద్ధులకు కొంత ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, వారు కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతిని పొందుతారు. ఇది వారికి ఒంటరితనం నుంచి ఉపశమనం ఇస్తుంది. అటు వైపు, ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు తాతలు, నాయనమ్మల ప్రేమ, కథలు, అనుభవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది జనరేషన్ మధ్య గ్యాప్ ఫిల్, చేయడానికి యువతలో పెద్దల పట్ల గౌరవాన్ని, సానుభూతిని పెంచుతుంది. ఈ సిస్టమ్ జపాన్‌లో ఉండటాన్ని చూసి.. తాము కూడా ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థపై మరింత చర్చను లేవనెత్తుతుంది.

వృద్ధులకు పిల్లలకు లాభం

అటు వైపు, ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు తాతలు, నానమ్మల ప్రేమ, కథలు, అనుభవాలు తెలియజేస్తోంది. ఇది తరాల మధ్య అంతరాన్ని పూరించి, యువతలో పెద్దల పట్ల గౌరవాన్ని, సానుభూతిని పెంచుతుంది. ఈ వినూత్న ఆలోచన జపాన్‌లో ప్రారంభమైన ఒక వ్యవస్థ నుంచి ప్రేరణ పొందిందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థపై మరింత చర్చను లేవనెత్తుతుంది. అయితే ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని మానవ సంబంధాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం అని విమర్శిస్తుండగా, మరికొందరు దీనిని సామాజిక సేవగా అభివర్ణిస్తున్నారు.

Also Read :  కుంభమేళా మొనాలిసాకు మరో బంపర్ ఆఫర్.. సౌత్ స్టార్ హీరోతో సినిమా!

Advertisment
తాజా కథనాలు