/rtv/media/media_files/2025/09/01/major-earthquake-in-afghanistan-2025-09-01-07-15-28.jpg)
Major earthquake in Afghanistan
పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) లో భారీ భూకంపం సంభవించింది.తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 8 కి.మీ (6 మైళ్ళు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.కనీసం 500 మందికి పైగా మరణించారని, 1000 మందికి పైగా గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా రని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్‌లో నిన్న అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 6.0గా నమోదు అయింది.ఈ విపత్తులో 500 మంది మృతిచెందినట్లు తుర్కియే మీడియా సంస్థ అనడోలు ఏజెన్సీ కథనం వెల్లడించింది. తొలుత 500 మంది మరణించినట్లు అఫ్గాన్ పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ సంఖ్య ఘననీయంగా పెరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వందల కొద్దీ ఇళ్ళు శిథిలమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. మారుమూల పర్వత ప్రాంతాలలో వచ్చిన భూకంపంతో సహాయ చర్యలకు ఇబ్బంది తలెత్తుతుందని, క్షతగాత్రులకు సహాయం చేయాలని తాలిబాన్ ప్రభుత్వ అధికారులు మానవతా సంస్థలను కోరారు. - భూకంపం ధాటికి కాబూల్ నుండి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు గల అనేక భవనాలు కంపించాయి - ఈ భూకంపం 300 కి.మీ (186 మైళ్ళు) కంటే ఎక్కువ దూరంలో దాని ప్రభావం చూపిందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:డ్రాగన్, ఏనుగు మధ్య స్నేహం.. దీనివల్ల భారత్‌కు లాభమేంటి?
Major Earthquake In Afghanistan
ఈ భూకంపం(earthquake) ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దేశ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కు సరిహద్దు ప్రాంతంగా ఉన్న తజకిస్తాన్ లోనూ తేలికపాటి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కడ ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో గత కొన్ని రోజులేగా వరుసగా భూమి ప్రకంపిస్తూ వస్తోంది. ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఇవి ఎక్కువగా నమోదు అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 2, 17వ తేదీల్లో కూడా 5.1, 4.9 తీవ్రతతో భూమి కంపించింది. తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. బుధవారం రాత్రి 36.32 నార్త్ అక్షాంశం, 71.33 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బఘ్లాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది.
ఇది కూడా చూడండి:పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టిన చైనా.. ఇండియాకు ఫుల్ సపోర్ట్!
భూ ఉపరితలం నుంచి 138 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. దాదాపుగా లక్ష మందికి పైగా జనాభా ఉండే బాగ్లాన్ నగరానికి తూర్పున 164 కి.మీ దూరంలో ఉండే ప్రాంతం కేంద్రంగా భూమి కంపించడాన్ని గుర్తించినట్లు యూరోపియన్ మిడ్ టెర్రయిన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంప తీవ్రత బఘ్లాన్ సిటీలో కనిపించింది. ఈ రీజియన్ పరిధిలోని బహరక్, ఫైజాబాద్, దరియా-ఏ- పిష్కాన్.. వంటి పట్టణాలు, గ్రామాల్లో కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
Also Read : బ్రహ్మణులకు లాభం, ప్రజలకు నష్టం... భారత్ పై నవరో అక్కసు