Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ బయటపెట్టిన UP సీఎం యోగి

ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి ఉపయోగించామని యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో నేడు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా దాన్ని ప్రారంభించారు.

New Update
UP Cm yogi

ఆపరేషన్ సింధూర్‌ గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌‌పై భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ చేసిన విషయం తెలిసిందే. మే 6 అర్థరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. 25 నిమిషాలపాటు చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని యూపీ సీఎం వెల్లడించారు. అప్పుడే ఈ క్షిపణులకున్న శక్తి గురించి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే పాకిస్తాన్‌ని అడిగి తెలుసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.

Also Read :  తస్సాదియ్యా ఆఫర్ అదిరింది.. వన్‌ప్లస్ కిర్రాక్ డిస్కౌంట్ - వదలొద్దు మావా!

UP CM Yogi Adityanath Said Brahmos Missiles

Also Read :  మే 15 నుంచి ఐపీఎల్.. బీసీసీఐకి బిగ్ టాస్క్!

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూజ్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాజ్‌నాథ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్రప్రభుత్వం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని సీఎం యోగి తెలిపారు.

Also Read :  బలితీసుకున్న బియ్యం డబ్బా.. 7 ఏళ్ల బాలుడు మృతి

Also Read :  Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ బయటపెట్టిన UP సీఎం యోగి

910రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ఏటా 80 నుంచి 100 క్షిపణులను తయారవుతాయన్నారు. బ్రహ్మోస్‌ క్షిపణులు 290 నుంచి 400 కి.మీ పరిధిని, మాక్‌ 2.8 రెట్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ఉగ్రవాదం కుక్కతోక లాంటిది. అది ఎప్పుడూ వంకరగానే ఉంటుందన్నారు. దాన్ని సరిచేయాలంటే వాళ్లు రీతిలోనే బదులివ్వాలని ఆయన అన్నారు.

 

(yogi-adityanath | cm-yogi-adityanath | up-cm-yogi-adityanath | india operation sindoor | indian army operation sindoor | brahmos missiles | rajnath-singh | defence-minister-rajnath-singh | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు