/rtv/media/media_files/2025/05/11/AYYoia9Jl3zToeG3eXTF.jpg)
ipl-2025-2.0
ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2025 కు సడన్ గా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. 2025 మే 15 నుంచి తిరిగి ఐపీఎల్ లో ఆగిపోయిన మ్యాచ్ లను ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లుగా సమాచారం. స్వదేశాలకు వెళ్లిన ఆటగాళ్లను తిరిగి రప్పి్ంచాలని ప్రాంఛైజీలకు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Also read : IND vs SL : ట్రై సిరీస్ ఫైనల్ .. శ్రీలంక ఫట్.. ఇండియా సూపర్ విక్టరీ!
ఓవర్సీస్ ప్లేయర్లు పెద్ద సమస్య
అయితే బీసీసీఐకి ఇప్పుడు ప్రధానంగా పెద్ద సమస్యే ఎదురైంది.అదే ఓవర్సీస్ ప్లేయర్లు. ఐపీఎల్ వాయిదా పడటం, యుద్ధ నేపథ్యంలో విదేశీ ప్లేయర్లంతా భారత్‌ను విడిచి తమ దేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ రీ స్టార్ట్ అయితే వీరిని వెనక్కి తీసుకురావడం అనేది ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌లో ఆడేందుకు మళ్లీ భారత్‌కు వస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Also read : Soldier Daughter : సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు
ఇక ఈ ఐపీఎల్ లో మరో 12లీగ్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో అహ్మదాబాద్ 3, లక్నో, బెంగళూరు చెరో 2, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, ధర్మశాల తలో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. భద్రత కోసం ధర్మశాల మ్యాచ్ ను వేరే వేదికకు తరలించే అవకాశం ఉంది.
Also read : Rahul-Modi: ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..