Defence Minister Rajnath Singh: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఓటమి భయంతో కేజ్రీవాల్ సహా ఇండియా కూటమి నేతలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.