UAE Scraps: భారత్ దెబ్బ.. పాక్ అబ్బా.. UAE డీల్ క్యాన్సెల్.. అసలేం జరిగిందంటే?

ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ అల్ నహ్యాన్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

New Update
UAE Scraps Pakistan Airport Deal Soon After President’s India Visit

UAE Scraps Pakistan Airport Deal Soon After President’s India Visit

ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ అల్ నహ్యాన్(Sheikh Mohamed Bin Zayed Al Nahyan) భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌(pakistan) కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఎయిర్‌పోర్టు నిర్వహణను ఔట్‌సోర్సింగ్ చేసే ప్రక్రియలో UAE ఆసక్తిని కోల్పోయినట్లు పాకిస్థాన్ పత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' వెల్లడించింది. దీన్ని నిర్వహించేందుకు తగిన భాగస్వామిని గుర్తించడంలో యూఏఈ విఫలమైందని.. అందుకే ఈ ఒప్పందం నుంచి వైదొలగినట్లు పేర్కొంది. 

అయితే UAE అధ్యక్షుడు ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) తో సమావేశమైన కొద్దిరోజులకే ఈ నిర్ణయం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయం వెనుక గల్ఫ్‌ ప్రాంతంలో మారుతున్న రాజకీయ సమీకరణల ప్రభావం కూడా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.  ముఖ్యంగా సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి పాకిస్థాన్ 'ఇస్లామిక్ నాటో' వంటి కూటమి కోసం ప్రయత్నిస్తుండటం UAEకి కొంత అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం రద్దు రావడంతో పాక్ సర్కార్‌ ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టును 'యాక్టివ్ ప్రైవేటీకరణ' జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. 

Also Read: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. షాక్ అయిన బంధువులు!

UAE Scraps Pakistan Airport Deal

ఇదిలాఉండగా జనవరి 19న షేక్ మొహమ్మద్ బిన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ఆయుధాల కొనుగోలుకే మాత్రమే పరిమితం కాకుండా, రక్షణ పరికరాలను ఇరు దేశాలు కలిసి తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో సాయుధ వాహనాల అప్‌గ్రేడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యుద్ధ తంత్రాలు, రోబోటిక్స్ వంటివి ఉన్నాయి. అలాగే ఇరుదేశాల సైన్యాల మధ్య పరస్పర అవగాహన పెంచేందుకు ఉమ్మడి విన్యాసాలు నిర్వహించనున్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ దాడులు అరికట్టేందుకు ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పంచుకోనున్నాయి. 

Also Read: ఇండియా-ఈయూ మధ్య చారిత్రాత్మక ట్రేడ్ డీల్.. ఈ రంగాల వారికి భారీగా లాభం

అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC), భారత్‌కు చెందిన HPCL మధ్య 10 ఏళ్ల కాలపరిమితితో భారీ ఎల్‌ఎన్‌జీ (LNG) ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను భారత్‌కు సరఫరా చేస్తారు. మరోవైపు 'శక్తి చట్టం'  కింద అణు విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ, చిన్న తరహా అణు రియాక్టర్ల (SMRs) అభివృద్ధిలో సంయుక్తంగా పనిచేయనున్నాయి. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు (రూ.16 లక్షల కోట్లు) చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇది 100 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్యపరమైన ప్రయోగాల కోసం ఇరు దేశాల స్పేస్ ఏజెన్సీల మధ్య కూడా కీలక ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రైల్వే కనెక్టివిటీ అభివృద్ధిలో UAE భాగస్వామి కానుంది.

Advertisment
తాజా కథనాలు