India-EU Trade Deal: ఇండియా-ఈయూ మధ్య చారిత్రాత్మక ట్రేడ్ డీల్.. ఈ రంగాల వారికి భారీగా లాభం

భారత్-యురోపియన్ యూనియన్ (EU) మధ్య 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు పక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(FTA) సంతకాలు చేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా పేర్కొన్నారు.

New Update
Historic India-EU Trade Deal

Historic India-EU Trade Deal

భారత్(bharat)-యురోపియన్ యూనియన్ (EU) మధ్య 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం(Historic India-EU Trade Deal) ఖరారైంది. ఇరు పక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(FTA) సంతకాలు చేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లేయెన్, EU కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి  ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. 

Also Read: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. షాక్ అయిన బంధువులు!

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరువైపుల 90 శాతానికి పైగా వస్తువుల పన్నులు తగ్గనున్నాయి. మరికొన్ని వాటిపై అసలు పన్నులే ఉండకపోవచ్చు. మొత్తంగా చూసుకుంటే  రాబోయే ఏడేళ్లలో భారత్ నుంచి వెళ్లే 99.5 శాతం వస్తువులపై ఈయూ సుంకాలను రద్దు చేయనుంది. విదేశీ కార్లపై ప్రస్తుతం ఉన్న 110 శాతం సుంకాన్ని రాబోయే ఐదేళ్లలో 10 శాతానికి తగ్గించేందుకు భారత్ ఒప్పుకుంది. అలాగే వైన్లపై ఉన్న 150 శాతం సుంకాన్ని వెంటనే 75 శాతానికి తగ్గించి.. ఆ తర్వాత క్రమంగా 20 శాతానికి తీసుకురానున్నారు. ఇరు కూటములకు ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతు వాటా ఉంది. దీంతో ఇరుపక్షాల మధ్య బంధం మరింత బలపడనుంది. 

Also Read: మెక్సికోలో నరమేధం: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి

ఈ రంగా వారికి లాభం

ఈ ఒప్పందం ద్వారా పలు భారతీయ రంగాలకు విదేశాల్లో సువర్ణ అవకాశాలు రానున్నాయి. యూరప్‌లో భారతీయ దుస్తులకు విపరీతంగా డిమాండ్ పెరగనుంది. రత్నాలు, ఆభరణాలు వంటివాటిపై సుంకాలు సున్నాకి చేరడం వల్ల ఈ రంగాలకు మరింత లాభం ఉంటుంది. ఇక ఫార్మా, కెమికల్స్‌ లాంటి వాటికి మెరుగైన మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఐటీ నిపుణుల రాకపోకలు కూడా మరింత సలుభతరం కానున్నాయి. వైద్య పరికరాలపై కూడా సుంకాల్ని ఎత్తివేసే ఛాన్స్ ఉంది. యంత్రాలు 44 శాతం, కెమికల్స్‌పై 22 శాతం ఉన్న దిగుమతి సుంకాలు సైతం తగ్గనున్నాయి. ఆలివ్ ఆయిల్, వెజిటెబుల్ ఆయిల్‌పై కూడా సుంకాలు ఎత్తివేయనున్నారు. అయితే యూరప్‌ నుంచి భారత్‌కు దిగుమతులు చౌకగా రావడంతో పలు రంగాలు ఒత్తిని ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్, పాల ఉత్పత్తులు, వైన్ తయారీ సంస్థలకు పోటీ ఎదురవుతుంది.  

అయితే భారత్-ఈయూ ఒప్పందం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి సానుకూల సంకేతాలు అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌కు ఈయూ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 మధ్య ఇండియా-ఈయూ మధ్య 136 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ముఖ్యంగా భారత తయారీ, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ లాంటి రంగాల్లో యురోపియన్ యూనియన్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే పలు భారత ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా చాలావరకు యూరప్‌లో సేవలందిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు