Explainer: వెనిజులా విషయంలో పుతిన్ అందుకే సైలెంట్గా ఉన్నాడా?

వెనెజువెలాపై దాడితో ప్రపంచ పరిణామాలు చాలా మారిపోయాయి. దీంతో ఒక్కసారి అగ్రరాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ దేశ దూకుడుకు రష్యా ల్లాంటి దేశాలు కూడా కాస్త నెమ్మదిస్తున్నాయని తెలుస్తోంది. అందుకే పుతిన్ కూడా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. 

New Update
trump, putin

Trump, Putin

వెనెజువెలా, గ్రీన్ ల్యాండ్...ఇప్పుడు ఇరాన్. సెడన్ గా అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై దండయాత్ర మొదలెట్టారు. వెనెజువెలా పై అమెరికా చేసిన దాడికి అయితే ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. ఆ తరువాత గ్రీన్ ల్యాండ్ విషయంలో కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అందరి నోటా మాట లేకుండా చేసేసింది. అమెరికా తన సైనిక శక్తిని చాలా ఏళ్ళ తర్వాత ప్రదర్శించింది. తాజాగా ఇరాన్ విషయంలో కూడా  అమెరికా ఇలానే ప్రవర్తిస్తోంది. ఆ దేశంపై దాడికి దాదాపు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌లో నిరసనలకు అమెరికా సపోర్ట్ చేస్తోంది. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో పలు ప్రతిపాదనలు కూడా ట్రంప్ ముందున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హెచ్చరికలు, చర్యలు అన్నింటినీ ప్రపంచం అంతా చాలా నిశితంగా పరిశీలిస్తోంది. అందరూ తమ జాగ్రత్తల్లో తాము ఉన్నారు. 

Also Read: తెలంగాణలో కొత్త జిల్లాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సున్నితంగా మారిన అంశాలు..

రష్యా కూడా కొన్ని రోజులుగా మౌనంగా ఉంది. అమెరికా దూకుడును పరిశీలించిన రష్యా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అమెరికా సైనికులు తాజాగా ఆ దేశ నౌకపై కూడా దాడి చేయడం ఇందుకు కారణమని తెలుస్తోంది. గ్రీన్ ల్యాండ్ బెదిరింపులు, నౌక స్వాధీనం...ఈ రెండు విషయాల్లో కూడా క్రెమ్లిన్ సంయమనంతో స్పందించింది. అమెరికా చర్యలతపై వ్యాఖ్యలు చేసినా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఈ కొత్త ఏడాదిలో అసలు కనిపించలేదు కూడా. మిగతా ప్రతినిధులు కూడా మీడియాకు దూరంగా ఉన్నారు. 

Also Read: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

పశ్చిమ దేశాల విషయంలో చాలా ఏళ్ళ బట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం ఉంది. ఆ దేశాల రక్షణ విషయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వెనెజువెలా, ఆర్కిట్ లాంటి చోట్ల భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. కానీ వెనెజువెలాపై అమెరికా దాడి చేసినప్పుడు మాత్రం పుతిన్ ఏ మాత్రం స్పందించలేదు. గ్రీన్ ల్యాండ్ విషయంలో కూడా కూడా ఆయన ఏమీ వ్యాఖ్యలు చేయలేదు. కావాలనే పుతిన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్(ukraine), అమెరికా, మాస్కోల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాము ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి ఉక్రెయిన్, వాషింగ్టన్ మధ్య సున్నితమైన చర్చలకు భంగం కలిగించవచ్చనే ఆలోచనలో రష్యా ఉంది. అదీ కాక వెనెజువెలా ఇంకా తమ ఆధీనంలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తాజాగా తాను వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇది కూడా రష్యా ఏమీ మాట్లాడకుండా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అమెరికా కొత్త జాతీయ భద్రతా సిద్ధాంతానికి అనుకూలంగా కూడా క్రెమ్లిన్ మాట్లాడింది. వారు చేసింది ఆచరణీయంగా ఉంది అంటూ వ్యాఖ్యలు కూడా చేసింది. సీనియర్ రష్యన్ శాసన సభ్యులు మాత్రం అమెరికా దాడులు అసౌకర్యం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పినప్పటికీ...అవి దీర్ఘకాలిక లాభాలను చేకూరుస్తాయి అంటూ మాట్లాడడం గమనించదగ్గ విషయం. 

Also Read: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ?

ఉక్రెయిన్ కంటే ఏదీ ముఖ్యం కాదు..

నిజం చెప్పాలంటే...వెనెజువెలాను అదుపులోకి తీసుకుని రష్యాను దెబ్బ కొట్టింది అమెరికా. రష్యా దశాబ్దాలుగా అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ అమెరికా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇది రష్యాకు భారీ నష్టమే. కానీ ఉక్రెయిన్ తో పోల్చుకుంటే వెనెజువెలా చిన్న విషయం. ఉక్రెయిన్ విషయంలో ఏ మాత్రం తేడాలు వచ్చినా నాలుగేళ్ళుగా రష్యా చేస్తున్న పోరాటం వృధా అయిపోతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా ప్రస్తుతానికి మాస్కోకే సపోర్ట్ చేస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన మాట వినడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కాలంగా చిరాకుగా కూడా ఉన్నారు. ఆయనను దారిలోకి తెచ్చుకోవడానికి వారి మిత్ర దేశాలపై సుంకాల దాడి కూడా చేస్తున్నారు.

ఇలాంటి నాజూకు సమయంలో అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడం కానీ, దానికి కోపం తెచ్చే విధంగా మాట్లాడడం కానీ అంత మంచి విషయాలు కావు. కొంచెం తేడా వచ్చిన అమెరికా...ఉక్రెయిన్ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు రష్యా ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే రష్యా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ ను వదులుకోవడానికి పుతిన్ సిద్ధంగా లేరు. అందుకే తమ నౌకను అమెరికా సీజ్ చేసినప్పుడు కూడా...రష్యన్ సిబ్బందిని సురక్షితంగా తిరిగి ఇవ్వాలని మాస్కో అభ్యర్థించింది. ట్యాంకర్ల గురించి అసలు మాట్లాడలేదు. ఏది ఏమైనా ప్రస్తుత నాజుకు పరిస్థితుల్లో రష్యా నిశ్శబ్దంగా ఉండడమే మంచిదనే అభిప్రాయంలో ఆ దేశం ఉంది. కాస్త పరిస్థితులు సద్దుమణిగే వరకు చాకచక్యంగా వ్యవహరించడమే ఉత్తమమని అనుకుంటోంది. 

Advertisment
తాజా కథనాలు