Mahua Moitra: భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన మహువా మెయిత్రా.. వీడియో వైరల్

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన భర్త పినాకి మిశ్రాతో కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్‌కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
TMC's Mahua Moitra shares video dancing with Pinaki Misra in wedding sneak peek

TMC's Mahua Moitra shares video dancing with Pinaki Misra in wedding sneak peek

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బీజు జనతాదళ్ (BJD) నేత పినాకి మిశ్రాతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి వేడుకలు జరుగుతున్న వేళ వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్‌కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..

TMC's Mahua Moitra Shares Dancing Video With Pinaki Misra

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ఎంపీగా ఉన్న మహువా మొయిత్రా.. ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ పినాకి మిశ్రాను పెళ్లాడారు. మే 3న జర్మనీలోని బెర్లిన్‌లో వీళ్లిద్దరూ సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేశారు. మహువా దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫొటో వైరలవ్వడంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న వార్త బయటకువచ్చింది. 

Also Read: బెంగుళూరు తొక్కిసలాటలో వారికి రూ.25లక్షలు పరిహారం

దీంతో పలువులు రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏంటటే మహువా మొయిత్రా, పినాకీ మిశ్రా.. వీళ్లిద్దరికీ కూడా ఇది రెండో వివాహమే. గతంలో మహువా మొయిత్రా డానిష్ ఫైనాన్షియర్‌ లార్స్‌ బ్రోర్స్‌న్‌ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మహువా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. 

Also Read: ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్

Also Read: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్

 

telugu-news | rtv-news | mahua-moitra | latest-telugu-news | national news in Telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు