LA: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్

  ఇమ్మిగ్రేషన్ దాడులను ఖండిస్తూ లాసం ఏంజెలెస్ ఫెడరల్ బిల్డింగ్ బయట ఆందోళనకారులు చేస్తున్న నిరసన ఉద్రిక్తమవుతోంది. దీనినకి అదుపు చేసేందుకు ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డులను దింపారు.

New Update
usa

Los Angeles Violence

 ఆకస్మిక వలస దాడుల ఫలితంగా నగరవ్యాప్తంగా నిరసనలు, దాడులతో  లాస్ ఏంజెలెస్ అట్టుడికిపోతోంది. నిన్న మొదలైన ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 118 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  సర్వీస్‌ ఎంప్లాయిస్‌ ఇంటర్నేషనల్ యూనియన్..కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ హుయెర్టాను  అరెస్టు చేశారు. నిన్న మధ్యాహ్నం 1.30 నుంచి ఇవి మరింత ఎక్కువయ్యాయని చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్ లో యుద్ధ వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. వందలాది మంది అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 

2 వేల మంది నేషనల్ గార్డ్స్.. 

జరుగుతున్న నిరసనలను అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చగొడుతున్నారు. వాటిని అదుపుల చేసేందుకు మధ్యే మార్గం అనుసరించకుండా 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడకు పంపారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోతున్నారు. అలాగే భద్రతా సిబ్బంది కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి కార్లు తగలెడుతున్నారు. దారిన పోయే వాహనాలపై దాడులు చేస్తున్నారు. కొంతమంది నిరసనకారులు అధికారులపై విరిగిన కాంక్రీటు ముక్కలను విసిరి, ఫెడరల్ కోర్టు భవనంపై స్ప్రే-పెయింట్ నినాదాలు రాశారు.  నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వారిపై టియర్ గ్యాస్, పెప్పర్ స్పే వంటి ప్రయోగిస్తున్నారు. కొన్ని చోట్ల ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్లను కూడా వాడారు. వీరిని అదుపు చేసేందుకు ఈరోజు అదనంగా 2 వేల మంది నేషనల్ గార్డ్ సెక్యూరిటీని అధ్యక్షుడు ట్రంప్ అలాస్ ఏంజెలెస్ పంపించారు. 

మరోవైపు అధ్యక్షుటు ట్రంప్ కూడా తగ్గేలే అంటున్నారు. ఎలా అయినా అక్రమవలసదారులను వెళ్లగొడతామని చెబతున్నారు. అక్రమవలసదారులను విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ట్రంప్ ఇచ్చారు.  యూఎస్‌ చట్టాలకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.  మరోవైపు లాస్‌ ఏంజెలెస్‌ ఘటనను వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ తీవ్రంగా ఖండించారు. రోజుకు మూడు వేలమందిని అరెస్ట్ చేయాలని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు