Military Drill: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..

మిలటరీ డ్రిల్‌ 17వ ఎడిషన్ అయిన 'నోమాడిక్ ఎలిఫెంట్ 2025'.. భారత్, మంగోలియా మధ్య జరుగుతోంది. ప్రస్తుతం ఇది మంగోలియాలోని ఉలాంబాటర్‌లో జరుగుతున్నట్లు భారత సైన్యం వెల్లడించింది.

New Update
India, Mongolia hold joint military drill 'Nomadic Elephant 2025' in Ulaanbaatar

India, Mongolia hold joint military drill 'Nomadic Elephant 2025' in Ulaanbaatar

ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కోసం అప్పుడప్పుడు భద్రతా దళాలు మిలిటరీ డ్రిల్‌ను నిర్వహిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే మిలటరీ డ్రిల్‌ 17వ ఎడిషన్ అయిన 'నోమాడిక్ ఎలిఫెంట్ 2025'.. భారత్, మంగోలియా మధ్య జరుగుతోంది. ప్రస్తుతం ఇది మంగోలియాలోని ఉలాంబాటర్‌లో జరుగుతున్నట్లు భారత సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం.. ఈ శిక్షణ అనేది సెమీ అర్బన్, పర్వత ప్రాంతాల్లో సంప్రదాయేతర కార్యకలాపాలపై దృష్టి సారిస్తుందని పేర్కొంది.  

Also Read: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి

Nomadic Elephant 2025

ఇరు దేశాల బలగాల సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ ఆపరేషన్‌ లక్ష్యమని తెలిపింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే బృందాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు ఎదుర్కొనే విధానాన్ని మార్పిడి చేసుకుంటాయని.. తద్వార బలగాల సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొంది. మొత్తానికి ఈ సంయక్త మిలిటరీ డ్రిల్స్‌ ద్వారా.. భద్రతా పరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు తమ సామార్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా భారత, మంగోలియన్ భద్రతా దళాలు పనిచేస్తున్నాయి. 

Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు

వాస్తవానికి ఈ నోమాడిక్ ఎలిఫాంట్ 2025 మాక్‌ డ్రిల్ మే 31న ప్రారంభమయ్యింది. ఇది జూన్‌ 13 వరకు ఇది జరగనుంది. దీని ప్రారంభోత్సవానికి మంగోలయ భారత అంబాసిడర్ అతుల్ మల్హారీ గోట్సర్వే, అలాగే మంగోలియన్ వైపు నుంచి మేజర్ జనరల్ లఖాగ్వాసురెన్ గన్సెలెం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంయుక్త మిలటరీ డ్రిల్ ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాన్ని బలోపేతం చేస్తుందని.. భద్రత బలగాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. 16వ ఎడిషన్ సంయుక్త మాక్‌ డ్రిల్ కూడా 2024లో భారత్‌లోని మెఘాలయాలో నిర్వహించారు.  

Also Read: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

Also Read: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు

 

telugu-news | rtv-news | mock drill | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు