Chittoor Crime News
AP Crime: చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషాద సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం బాధిత యువతి 60 శాతం కాలిన గాయాలతో కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన యువతి కాగా.. APSRTCలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నది. ఆమె గతంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేసిన వాసుతో ప్రేమలో పడింది. వాసు కుప్పం మండలంలోని మర్వాడకు చెందిన వ్యక్తి. ఇద్దరి మధ్య నెలల పాటు కొనసాగిన ప్రేమ సంబంధం అనుకున్నదానికంటే భిన్నంగా మారిపోయింది.
ప్రేమలో మోసపోయిందని..
ఆరు నెలల క్రితం వాసు ఉద్యోగాన్ని మానేసి కుప్పానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బాధిత యువతితో సంబంధాన్ని నెమ్మదిగా విరమించుకున్నాడు. ఆశలు వదలని బాధిత యువతి అతను మళ్లీ తమ సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తాడని నమ్మింది. కానీ తాజాగా వాసు మరో యువతితో వివాహం చేసుకున్న విషయం బాధితురాలికి తెలియకపోయింది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. గుండెను గాయం చేసిన ప్రేమికుడిని కలుసుకోవాలని కుప్పానికి వెళ్లిన ఆమె.. వాస్తవాలు తెలుసుకొని అదుపు తప్పిపోయింది. తన భావోద్వేగాలను తట్టుకోలేక వాసు ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
పక్కనే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అగ్నిని ఆర్పి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత దృష్ట్యా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమలో మోసపోవడం ఎంతటి మానసిక వేదనకు దారితీస్తుందో.. నమ్మకాన్ని ఎలా ఆడుకుంటారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని.. బాధ్యుడిపై విచారణ జరిపి తగిన శిక్ష విధించాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో ఆడబిడ్డల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి యువకుడి తగిన శిక్ష వేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | ap-crime-report | Latest News | telugu-news)