Shravana Masam 2025: పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం, ధూమపానం వంటివి తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, మాంసాహారం తీసుకోవడం వంటివి చేయకూడదని పండితులు అంటున్నారు. వీటితో పాటు చెడు ఆలోచనలు, కోపం వంటివి కూడా ఉండకూడదని చెబుతున్నారు.

New Update
Shravana Masam 2025

Shravana Masam 2025

పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసంలో పూజలు నిర్వహించడం వల్ల కోరుకున్న అన్ని పనులు కూడా జరుగుతాయని పండితులు చెబుతుంటారు. అయితే కొందరికి తెలియక శ్రావణ మాసంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల దరిద్ర దేవత వారి నెత్తిమీద ఉంటుంది. అయితే పవిత్రమైన శ్రావణ మాసంలో అసలు చేయకూడని పనులు ఏంటి? పొరపాటున చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

మాంసాహారం తీసుకోవడం

శ్రావణ మాసంలో మాంసాహారం అసలు తినకూడదు. వీటితో పాటు ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. 

మద్యపానం, ధూమపానం
మాంసాహారంతో పాటు, మద్యపానం, ధూమపానం వంటివి తీసుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో అనుకున్న పనులు సరిగ్గా జరగవు.

గడ్డ పెరుగు తినడం
శ్రావణ మాసంలో అసలు గడ్డ పెరుగు తీసుకోకూడదు. దీనికి బదులు మజ్జిగ లేదా పల్చని పెరుగు తీసుకోవచ్చు. పెరుగును లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ కారణం వల్ల శ్రావణ మాసంలో గడ్డ పెరుగు తినకూడదని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

హింస చేయకూడదు
ఈ మాసంలో కొందరు ఇతర జీవులను బాధిస్తుంటారు. ఇలా హింస చేయడం మంచిది కాదని పండితులు అంటున్నారు.

జుట్టు కత్తిరించుకోవడం
ఈ మాసంలో జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.

శరీరానికి నూనె రాసుకోవడం
పవిత్రమైన శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాయకూడదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల మంచి జరగదని అంటున్నారు. 

చెడు ఆలోచనలు
కేవలం ఆహార నియమాలు మాత్రమే కాదు.. చెడు ఆలోచనలు కూడా ఈ మాసంలో రానివ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇతరులపై కోపం, ద్వేషం వంటివి కూడా ఉండకూడదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

పగటి సమయం నిద్ర
ఈ మాసంలో పగటి పూట అసలు నిద్రపోకూడదు. ముఖ్యంగా పూజలు చేసే వారు అయితే అసలు నిద్రపోకూడదని పండితులు అంటున్నారు.

రాగి పాత్రలో వండటం
రాగి పాత్రలో వండిన వంటలను ఈ మాసంలో తినకూడదని పండితులు చెబుతున్నారు.

బ్రహ్మచర్యం
ఈ మాసంలో తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు. భక్తితో పూజలు చేయాలని పండితులు అంటున్నారు.

తులసి ఆకులు
ఈ మాసంలో అసలు తులసి ఆకులు ఉపయోగించకూడదని పండితులు అంటున్నారు. ముఖ్యంగా శివుడిని పూజించేటప్పుడు అసలు ఉపయోగించకూడదని చెబుతున్నారు. 

వాయనం ఇచ్చేటప్పుడు
వాయనం ఇచ్చే సమయంలో ముత్తైదువులను గౌరవించాలని పండితులు అంటున్నారు. గౌరవించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వాయనంలో ఇచ్చే వస్తువులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. విరిగిపోయినవి, పాడైనవి అసలు ఇవ్వకూడదని పండితులు అంటున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

alchohol | latest-telugu-news | Shravana Masam

Advertisment
తాజా కథనాలు