/rtv/media/media_files/2025/07/25/temple-miracles-2025-07-25-17-15-23.jpg)
Temple Miracles
పవిత్ర శ్రావణ మాసం మొదలైన వేళ.. తిరుపతి నగరంలోని గాంధీపురంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కళ్ళు తెరిచిన మహా అద్భుత ఘటన చోటుచేసుకుంది. దీంతో వేల సంఖ్యల్లో భక్తులు ఆ ఆలయంలోని లింగాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. భక్తుల తాకిడితో ఆలయం కిక్కిరిసిపోయింది. శివనాస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. స్వయంగా ఆ ఏడుకొండల వారు వెలసిన తిరుపతిలో ఇలాంటి ఘటన వేలుచూడడం మరింత ప్రత్యేకంగా మారింది.
అయితే ఇలాంటి అద్భుత ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు గతంలోనూ పలు ఆలయాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు
శ్రీకాళహస్తి
గతంలో శ్రీకాళహస్తిలోనిలోని ఈటీసీ (ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రంలో ఉన్న పురాతన 'అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో' శివలింగం కళ్ళు తెరిచిందని వార్తలు వచ్చాయి. పూజారులు అభిషేకం చేసి, శివలింగాన్ని అలంకరించే సమయంలో శివుడి కళ్ళు తెరిచినట్లు గమనించారని ప్రచారం జరిగింది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.
Also Read : ఈ డ్రెస్ లో కీర్తిని చూస్తే ఎవ్వరైనా ఫిదా! ఫొటోలు చూశారా
బెల్గాం జిల్లాలో
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని గోకాక్ పట్టణంలోని శంకరలింగ ఆలయంలో కూడా శివలింగం కళ్ళు తెరిచిందని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన 2021 ఫిబ్రవరిలో జరిగింది. గత 17 ఏళ్ళలో ఇలా జరగడం రెండోసారని.. ఈ సంఘటన కరోనా మహమ్మారి అంతానికి సంకేతమని పూజారి, భక్తులు భావించారు. 2004లో డెంగ్యూ వ్యాపించినప్పుడు కూడా శివుడు కళ్ళు తెరిచాడని, ఆ తర్వాత డెంగ్యూ వ్యాప్తి తగ్గిందని అక్కడి భక్తులు భావించారట!
కళ్ళు తెరవడం మాత్రమే కాదు, శివలింగాలకు సంబంధించిన మరికొన్ని అద్భుతాలు కూడా ప్రచారంలో ఉన్నాయి
- శివలింగం కదిలిన ఘటనలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నదిలో శివలింగాలు కదిలినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు అవి పైకి లేచినట్లుగా కూడా ప్రచారం జరిగింది. వీటన్నింటినీ కూడా కూడా భక్తులు దైవలీలగా భావిస్తారు.
శివలింగాల నుంచి నీరు లేదా పాలు
అయితే కొన్ని ఆలయాల్లో శివలింగాల నుంచి అకస్మాత్తుగా నీరు లేదా పాలు వచ్చిన అద్భుత ఘటనలు వెలుగుచూశాయి.
Also Read : పాక్‌లో అల్లకల్లోలం సృష్టించిన వరదలు.. 270 మంది మృతి!
శివలింగం రంగు మారడం
రాజస్థాన్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుందనే ప్రచారం ఉంది (ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కాషాయం, రాత్రి నలుపు). శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా దీని వెనుక రహస్యం అంతుపట్టలేదని చెబుతారు.
అలాగే తమిళనాడులోని నాగకుడిలో ఒక శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే అది నీలి రంగులోకి మారుతుందని ప్రచారం ఉంది. అయితే, దీనికి 'టిండల్ ప్రభావం' అనే శాస్త్రీయ వివరణ ఉందని నిపుణులు చెబుతారు.
temple miracles | Latest News