Chhattisgarh: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి దేశంలోనే మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. నవ రాయ్‌పూర్‌లో 14 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు  చేస్తున్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. కొత్త యుగానికి డిజిటల్ వెన్నెముకని  తెలిపారు.

New Update
Chhattisgarh Chief Minister Vishnu Deo Sai

Chhattisgarh Chief Minister Vishnu Deo Sai

దేశంలోనే మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శంకుస్థాపన చేశారు. నవ రాయ్‌పూర్‌లో 14 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు  చేస్తున్నారు. అయితే ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. కొత్త యుగానికి డిజిటల్ వెన్నెముకని  తెలిపారు. ప్రపంచ డిజిటల్ పవర్‌హౌస్‌గా మారాలనే భారతదేశం ఆశయాలను తీర్చడానికి ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

2.7 హెక్టార్ల విస్తీర్ణంలో..

రాక్‌బ్యాంక్ డేటాసెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించనున్నారు. అయితే దీనిలో 2.7 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా అభివృద్ధి చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో సుమారుగా దీని పెట్టుబడి రూ. 2,000 కోట్ల అని అంచనా వేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం

ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఈ పార్క్ వల్ల  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని  విష్ణు దేవ్ సాయి అన్నారు. ఈ డేటా సెంటర్ పార్క్ ఐటీ రంగం, డేటా అనలిటిక్స్‌లో వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇకపై యువత ఉద్యోగాల కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు