/rtv/media/media_files/2025/05/01/66w9Ch0GWLaNV7GNrVG7.jpg)
Election Commission of India
కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయనున్నట్లు పేర్కొంది. దీనికోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు వెంటనే తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాత అత్యంత కచ్చితత్వంతో ఓటు జాబితాను అప్‌డేట్ చేసేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
'' రికార్డైన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికాలు (ERO) వెంటనే పొందే అవకాశం ఉంటుంది. అలాగే చనిపోయిన వాళ్ల కుటుంబీకుల నుంచి సమాచారం వచ్చేవరకు వేచి చూడకుండా.. ఆర్‌జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తారు. అక్కడ తమకు వచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసుకుంటారని'' ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల రూల్స్ 1960, జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారం తీసుకునే అధికారం ఉంటుంది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
ఓటరు సమాచార చీటీ (VIS) మరింత స్పష్టంగా కనిపించడం కోసం దాని డిజైన్‌ను మార్చాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్డు నంబర్ల సైజును కూడా పెంచనున్నట్లు సమాచారం. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను ఈసీగా గుర్తించవచ్చు. అలాగే పోలింగ్ అధికారులకు కూడా జాబితాలో పేర్లను సులభంగా సరిచూసుకునే అవకాశం ఉంటుంది. బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడి కార్డులు జారీ చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
telugu-news | rtv-news | election-commission | eci | national-news
Follow Us