/rtv/media/media_files/2025/02/15/KqUuvJleMFKTbGhxakWl.jpg)
Yogic Management for Musculoskeletal Disorders in MDNIY Workshop
న్యూఢిల్లీలోని మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDINY) కేంద్రంలో.. మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వ్యాధి వల్ల కండరాలు, కీళ్లు, భూజాలు, వెన్నుముక నొప్పితో బాధపడేవారు ప్రాచీనా యోగాసానాల ద్వారా ఎలా వాటిని అధిగమించాలో అనేదానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా.ఐఎన్. ఆచార్య మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌కు సంబంధించి వివిధ రూగ్మతల గురించి వివరించారు.
Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
ఆ తర్వాత MDINY డైరెక్టర్, డా.కాశీనాథ్ సమగండి ఈ వ్యాధిని ఎదుర్కోనేందుకు యోగా, ఆయుర్వేదం ఎలా పనిచేస్తాయనే అంశాలపై మాట్లాడారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం గురించి వివరించారు. అలాగే మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ రావడానికి గల వివిధ కారణాలను చెప్పారు. యోగాసానలు ఆచరించడం, సరైన నిద్ర వల్ల కండరాలు బలంగా తయారవుతాయని, ఎండోర్ఫిన్ హర్మోన్లు విడుదలవుతాయని పేర్కొన్నారు. ఇవి సాధారణ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయని చెప్పారు.
/rtv/media/media_files/2025/02/15/IUoxW1ImXJwpIyO3bENr.jpg)
ఆకు కూరలు, కూరగాయలు, బెర్రీస్, నట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలని సూచించారు. అల్లం పొడి, పసుపు, జీరా మొదలైన పదార్థాలను మరిగించడం ద్వారా ఆయుర్వేదంతో కూడిన నీటిని ఎలా తయారు చేయవచ్చో వివరించారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ నీరు ఎంతగానో దోహదపడతుందన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును అందించడం కోసం తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/02/15/DbTyrQsWldwxQdbWSaBR.jpg)
Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ
ప్రస్తుత రోజుల్లో మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ పెరగడం సవాలుగా మారుతోంది. వాటిని నియంత్రంచేందుకు యోగా శాస్త్రీయమైన విధానాన్ని అందిస్తోంది. ఈ వర్క్‌షాప్ ద్వారా.. ఇలాంటి రూగ్మతల నుంచి బయటపడేందుకు, యోగాను తమ రోజువారి జీవితంలోకి మార్చుకునేలా దీనిపై అవగాహణ కల్పించి వీళ్లను సన్నద్ధం చేయాడమే మా లక్ష్యమని'' కాశీనాథ్ సమగండి తెలిపారు.