Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళాలోని సెక్టార్ 18, 19ల మధ్య ఉన్న అనేక శిబిరాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అనేక గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి.పలు గుడారాలు కాలి బూడిదయ్యాయి.

New Update
Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళాలోని సెక్టార్ 18, 19ల మధ్య ఉన్న అనేక శిబిరాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అనేక గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి. పలు గుడారాలు కాలి బూడిదయినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. ప్రమాద సమయంలో శిబిరాలు ఖాళీగా ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా.. అగ్నిప్రమాదాల గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

మంటలకు గుడారాల్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Fire Accident In Maha Kumbh Mela 2025

కాగా ఇప్పటికే పలుమార్లు కుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 13న కూడా సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్ సమీపంలోని ఖాళీ గుడిసెల్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అంతకు ముందు ఫిబ్రవరి 9న రాత్రి మహా కుంభమేళా ప్రాంతంలోని ఆరైల్ వైపు ఉన్న సెక్టార్ 23లో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని గుర్తించారు. మహారాజా భోగ్ అనే హోటల్ లో సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో అనేక శిబిరాలు దగ్ధమైనట్లు  తెలిపారు.

Also Read :  మస్తాన్ సాయికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు: ఇక జైల్లోనే!

ఫిబ్రవరి 7 న కూడా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. సెక్టార్ 18లోని శంకారాచార్య మార్గ్ లోని ఒక శిబిరంలో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో చాలా టెంట్లు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక దళం వేగంగా స్పందించి, పెద్ద ప్రమాదం జరగ కుండా మంటలను అదుపు చేసింది. జనవరి 30న మహాకుంభ్ లోని సెక్టార్-22లో అనేక శిబిరాలు మంటలకు ఆహుతయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో 15 టెంట్లు కాలి బూడిదయ్యాయి. జనవరి 19న సెక్టార్ 19లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక శిబిరంలో ఉంచిన ఎండుగడ్డి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో దాదాపు 18 శిబిరాలు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోయినప్పటికీ మౌని అమావాస్య సందర్భంగా గతన నెల 29న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు.సుమారు 60 మంది గాయపడ్డారు.  

ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు