Watch Video: మెట్రో రైల్‌ స్టేషన్‌లో గేట్లు దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్‌

ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్లపై నుంచి కొందరు ప్రయాణికులు దూకిన ఘటన దుమారం రేపింది.దీనిపై స్పందించిన మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రయాణికుల రద్దీ వల్ల ఇది జరిగినట్లు చెప్పింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Delhi Metro Station

Delhi Metro Station

మెట్రో రైల్వే స్టేషన్‌లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్లపై నుంచి కొందరు ప్రయాణికులు దూకిన ఘటన దుమారం రేపింది. ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు గేట్లు దూకుతూ సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ క్లారిటీ ఇచ్చింది. 

Also Read: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...

''ఫిబ్రవరి 13న జామా మసీదు మెట్రో స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు వ్యక్తులు ఇలా గేట్లు దూకి వెళ్లారు. ఇది వాళ్ల క్షణికమైన ప్రతిచర్య. భద్రా సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పలేదని''ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. అలాగే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

Also Read: మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌కు యోగాతో చెక్.. మోరార్జీ దేశాయ్‌ యోగా కేంద్రంలో వర్క్‌షాప్

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

Also Read: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు

Advertisment
తాజా కథనాలు