TDS: టీడీఎస్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

టీడీఎస్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫండమెంటల్ రైట్స్‌కు భంగం కలుగుతోందంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

New Update
tds supreme

Supreme Court dismissed TDS cancellation petition

TDS:టీడీఎస్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫండమెంటల్ రైట్స్‌కు భంగం కలుగుతోందంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

ప్రాథమిక హక్కులకు ఆటంకం..

ఈ మేరకు ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం కింద పన్ను వసూలు చేస్తున్న టీడీఎస్‌ విధానాన్ని క్యాన్సిల్ చేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఉపాధ్యాయ్ కు మద్ధతుగా మరో లాయర్‌ అశ్వినీ దూబే ఈ వ్యాజ్యాన్ని వేశారు. టీడీఎస్ వల్ల ప్రాథమిక హక్కులకు ఆటంకం కలుగుతోందని ఫిటిషన్ లో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి:Biggest Flop Movie: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్‌.. రూ.800 కోట్ల నష్టం!

ఈ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందన్నారు. దీనిని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దూబే వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల సారథ్యంలోని ధర్మాసనం లోపభూయిష్టంగా ఉన్న ఈ ఫిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

ఇది కూడా చదవండి:ASAD: అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్‌ వేటు!

ఈ సందర్భంగా పిటిషన్‌లో లేవనెత్తిన వివాదాలను పరిగణనలోకి తీసుకుని, TDS వ్యవస్థలో అవసరమైన మార్పులను చేయాలని NITI అయోగ్‌ని ఆదేశించింది. లా కమిషన్ టీడీఎస్ వ్యవస్థ చట్టబద్ధతను పరిశీలించి మూడు నెలల్లోగా నివేదిక సిద్ధం చేయాలని కోరింది. ఆర్టికల్ 23ని ప్రస్తావిస్తూ ప్రైవేట్ పౌరులపై పన్ను వసూలు సుంకాలు విధించడం బలవంతపు చర్యగా పేర్కొంది. 

ఇది కూడా చదవండి:నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ బంపరాఫర్!

Also Read : భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

Advertisment
తాజా కథనాలు