నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ బంపరాఫర్!

పుష్ప 3 ఐటెమ్ సాంగ్లో ఎవరు కనిపిస్తారనే ఊహాగానాలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు. ఈ ఐటమ్ సాంగ్ కు జాన్వీ పర్పెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డాడు. ఆమె చేసిన పాటలు కొన్నింటిని తాను చూశానని వెల్లడించాడు. సాయి పల్లవి డ్యాన్స్ కు తాను పెద్ద అభిమానని చెప్పాడు.

New Update
devi sri prasad, janhvi

devi sri prasad, janhvi Photograph: (devi sri prasad, janhvi)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప, దీనికి కొనసాగింపుగా వచ్చిన  పుష్ప 2 సినిమా గతేడాది డిసెంబర్ 05వ తేదీన రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతుంది. సీక్వెల్ సంచలనం సృష్టించడంతో మేకర్స్ పుష్ప 3మూవీని కూడా చేయబోతున్నారు. ఇప్పటికే  పుష్ప 3 కూడా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు కూడా. పుష్ప 3 ది రాంపేజ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. 

అయితే పుష్ప 3 ఎలా ఉండబోతుందో అనే అంచనాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి.  ఈ క్రమంలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సినిమాపై ఓ స్టెట్ మెంట్ ఇచ్చి సినిమాపై మరింత హైప్ ను పెంచాడు. ఇంతకీ అదేంటంటే.. పుష్ప 3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపించవచ్చు అనేదానిపై  దేవిశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  పుష్ప సిరీస్‌ చిత్రాల్లో  ఐటెమ్‌ సాంగ్స్‌ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయన్నాడు.  పుష్ప2లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీలను తానే సూచించినట్లు చెప్పుకొచ్చాడు.  మూడో పార్ట్‌లో ఉండబోయే సాంగ్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ అయితే పర్‌ఫెక్ట్‌ అని ఈ సంగీత దర్శకుడు వెల్లడించాడు.  

తాను చేసే ఐటమ్ సాంగ్స్ బాగా క్లిక్ అవుతాయని తనకు ముందే తెలుసన్నాడు దేవీ.  తన పాటలతోనే టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ మొదలు పెట్టడం గర్వంగా ఉందని తెలిపాడు.  జిగేలు రాణిలో పూజా హెగ్డే, ఊ అంటావాలో సమంత, కిస్సిక్‌లో శ్రీలీల, పక్కా లోకల్‌లో కాజల్ అగర్వాల్ వీరంతా ఇప్పుడు టాప్ లో ఉన్నారు. వారి తొలి ఐటెమ్ సాంగ్స్ అన్ని తనతోనే ఉన్నాయని తెలిపాడు.  ఇక పుష్ప 3 ఐటెమ్ సాంగ్లో  ఎవరు కనిపిస్తారనే ఊహాగానాలపై దేవీ కొందరి పేర్లను ప్రస్తావించారు.  

తనకు అసాధారణమైన డ్యాన్సర్‌లతో పనిచేయడం ఇష్టమని చెప్పిన దేవీ..  సాయి పల్లవి డ్యాన్స్ కు తాను పెద్ద అభిమానని తెలిపాడు.  ఇక బాలీవుడ్ లో జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్ అని తెలిపాడు. ఆమె చేసిన పాటలు కొన్నింటిని తాను చూశానని,  ఆమెలో శ్రీదేవి స్వగ్ ఉందన్నాడు. అంతిమంగా పుష్ప3లో ఐటమ్ సాంగ్ కు జాన్వీ పర్పెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డాడు. నిజంగా దేవి అనుకుంటున్నట్లు పుష్ప3లో జాన్వీ ఐటమ్ సాంగ్ చేస్తే  మాత్రం ఆ కిక్కే వెరప్ప.   

Also Read :  మంచి చేశా అనుకున్నాడు కానీ ..అడ్డంగా బుక్కయ్యాడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు