/rtv/media/media_files/2025/01/24/kwOwWB09Qnx31JGrFhwR.jpg)
Hollywood Better Man biggest flop movie of 2025
బెటర్ మ్యాన్ మూవీ. ఇప్పుడంతా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. దర్శకుడు మైఖేల్ గ్రేసీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.950 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం రూ.130 కోట్లు మాత్రమే వసూళు చేసి రూ.800 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్
ఈ చిత్రం బ్రిటిష్ నంబర్ వన్ మ్యూజికల్ ఆర్టిస్ట్ రాబీ విలియమ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అతడు మరెవరో కాదు.. 30 ఏళ్ల క్రితం ఒక రోజులో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసిన ఆర్టిస్టు. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి.. కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. అతడి అన్ని ఆల్బమ్స్ కూడా నెంబర్ 1 ర్యాంకు అందుకున్నాయి.
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
అలాంటి ఆర్టిస్ట్ బయోపిక్ సినిమా బాక్సాఫీసు వద్ద ఇంత ఘోరంగా విఫలం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. జనవరి మొదట్లో విడుదలైన ఈ ‘బెటర్ మ్యాన్’ మూవీ 2025లో తొలి డిజాస్టర్‌గా నిలిచింది. ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీలో ఆర్టిస్ట్ రాబీ విలియమ్స్ పాత్రలో ఒక మనిషి కాకుండా.. చింపాంజీ నటించడం గమనార్హం.
Check out a sneak peek of the unbelievable musical sequence for 'Rock DJ' filmed on one of the most iconic streets in London for 'Better Man'.
— Robbie Williams (@robbiewilliams) December 18, 2024
'Better Man' is in cinemas from Dec 25th worldwide. Check your local release date at https://t.co/eUavH6cF4h#BetterManMovie pic.twitter.com/imVQUMZHah
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
గతేడాది లాస్ట్‌లో కొన్ని థియేటర్లలోనే ఈ సినిమాను ప్రదర్శించారు. అలాగే ఈ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్స్‌కు కూడా నామినేట్ అయింది. దీంతో ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర చతికిల్ల పడింది.
Also Read : భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
దాదాపు 110 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందింది. కేవలం 15 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఒక పాపులర్ సింగర్ బయోపిక్ ఇంతటి డిజాస్టర్ కావడానికి ముఖ్య కారణం.. చింపాంజీని పెట్టడమేనని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా వల్ల నిర్మాత కోట్లు నష్టపోయాడనే చెప్పాలి.