Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్‌ వేటు!

MIM చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్ తగిలింది. వక్ఫ్‌ చట్టం మార్పులపై పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో అసద్‌తోపాటు మొత్తం 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. 

New Update
Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!

AIMIM chief Asaduddin suspend

ASAD: MIM చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్ తగిలింది. 1955 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్లలో మార్పులపై జేపీసీ అధ్యయనం చేస్తున్న  విషయం తెలిసిందే. వక్ఫ్‌ చట్టంలో మార్పులపై తమకు తగినంత సమయం ఇవ్వట్లేదని ఇవాళ జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు.

10 మంది ఎంపీలు సస్పెండ్..

దీంతో జాయింట్‌ పార్లమెంట్ కమిటీ నుంచి అసద్‌ ను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. అసద్‌తో పాటు మొత్తం 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయినవారిలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, అసదుద్దీన్ ఓవైసీ, డీఎంకే ఎంపీ రాజా కూడా ఉన్నారు. 

ఈ మేరకు శుక్రవారం వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సమావేశంలో సభ్యుల మధ్య గందరగోళం చెలరేగింది. దీంతో మార్షల్స్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ గందరగోళం నేటి సమావేశం నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో సహా 10 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి దారితీసింది. కమిటీ ఆమోదించిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ బిజెపి సభ్యుడు నిషికాంత్ దూబే మోషన్‌ను ప్రవేశపెట్టారు. బిజెపి సభ్యుడు అపరాజిత సారంగి విపక్ష సభ్యుల ప్రవర్తన అసహ్యంగా ఉందని పేర్కొన్నారు, వారు సమావేశంలో నిరంతరం గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, పాల్‌పై అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వీరిని సస్పెండ్ చేశారు. 

 సస్పెండ్ అయిన ఎంపీల జాబితా
అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
కళ్యాణ్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్)
నడిముల్ హక్ (తృణమూల్ కాంగ్రెస్)
మొహిబుల్లా నద్వీ (సమాజ్‌వాదీ పార్టీ)
సయ్యద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్)
ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్)
మహ్మద్ జావేద్ (కాంగ్రెస్)
అరవింద్ గణపత్ సావంత్ (శివసేన-UBT)
ఎ రాజా (ద్రావిడ మున్నేట్ర కజగం)
MM అబ్దుల్లా (ద్రావిడ మున్నేట్ర కజగం

Advertisment
తాజా కథనాలు