భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

డైరెక్టర్ విశ్వనాథ్ ఆల్ టైం మాస్టర్ పీస్ 'సాగర సంగమం'లో ముందుగా నటి జయసుధను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో చేయలేదట. దీంతో ఈ అవకాశం మరోస్టార్ హీరోయిన్ జయప్రదను వరించింది.

New Update
Jayasudha heroine

Jayasudha heroine

Sagara Sangamam:  సాగర సంగమం..! ఏం సినిమారా ఇది.. అసలు ఇలాంటి సినిమా మళ్లీ రాలేదు.. రాదు కూడా.. రావాలంటే విశ్వనాథ్‌ మళ్లీ పుట్టాలి.. కమల్‌ మళ్లీ పాత కమల్‌గా మారాలి.. ఇది జరిగే పని కాదులే..! అయినా ఆ సినిమాలో నటించినవారు ఏదో జన్మలో పుణ్యం చేసుకునే ఉంటారు.. అందుకే అంత అదృష్టం దక్కింది. కానీ ఆ అదృష్టాన్ని చేజేతులే మిస్‌ చేసుకున్నారు సహజ నటి జయసుధ. ఏంటి అర్థంకాలేదా? అయితే ఈ కథ చదవాల్సిందే!

హీరోయిన్ గా చాన్స్ మిస్.. 

అయితే ఈ సినిమాలో ముందుగా కథానాయికగా అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధను అనుకున్నారట. కానీ, అప్పట్లో ఇండస్ట్రీలో లీడింగ్ యాక్ట్రెస్ గా కొనసాగుతున్న ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో జయసుధ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సినిమా చేయడం వీలు కాదని చెప్పారట. ఆతర్వాత ఆ ఛాన్స్ నటి జయప్రదను వరించింది. అలా జయసుధ  విశ్వనాథ్ ఆల్ టైం మాస్టర్ పీస్ లో నటించే అదృష్టాన్ని మిస్ చేసుకుంది. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు ఆ తర్వాత జయసుధ చాలా బాదపడ్డారట.  భారతీయ అత్యుత్తమ  చిత్రాలలో విశ్వనాథ్  క్లాసిక్స్  'సాగర సంగమం', శంకరాభరణం ఎల్ల కాలం నిలిచిపోతాయి. సాగరసంగమం తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. 

5 నెలలలు వెంటపడి

నటుడు కమల్ హాసన్ కూడా ముందుగా ఆ పాత్రను నిరాకరించారట. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే.. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని భయపడ్డారట. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన "కడల్ మీన్గళ్" అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో కమల్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండిపోయింది. దీంతో సినిమాకు నిరాకరించారట. కానీ నిర్మాత నాగేశ్వర్ కమల్ తోనే ఆ పాత్ర చేయించాలని 5 నెలలలు వెంటపడి ఒప్పించారట. ఒకవేళ కమల్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకొని ఉంటే.. తన కెరీర్ లో ఒక గొప్ప పాత్రను కాదన్నానే అనే వెలితి ఆయనకు ఎప్పటికీ ఉండిపోయేదేమో.

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు