/rtv/media/media_files/2025/01/31/McCGl4oz3DtF4IeyhxaG.jpg)
Jio Affordable recharge plans
జియో తన కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, ఇతర నెట్‌వర్క్ ప్రియులను రాబట్టుకునేందుకు తరచూ కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది జియో యూజర్లు ప్రతి నెలా రీఛార్జ్ చేయడానికి విసిగిపోతున్నారు. అందువల్ల 56 రోజులు, 84 రోజులు లేదా 90 రోజులు వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు.
అయితే దానితో కూడా విసిగిపోతున్న వారికి ఏడాది ప్లాన్‌లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. జియో 11 నెలలు, 12 నెలల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇక్కడ తక్కువ ధరతో పాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
జియో రూ.1234 రీఛార్జ్ ప్లాన్
రూ.1,234 ధరతో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో వినియోగదారులు ప్రతిరోజూ 0.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 300 SMSల ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే జియో యాప్‌లకు యాక్సెస్ కూడా లభిస్తుంది.
జియో రూ.1899 ప్లాన్
జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 336 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌లో 24GB డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్, మొత్తం 3600 SMSలు కలిగి ఉంటారు.
జియో రూ. 1,958 ప్లాన్
జియో రూ. 1,958 ప్లాన్‌లో వినియోగదారులు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇది 3600 SMSలు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనం లేదు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో హాట్‌స్టార్‌లను సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
జియో రూ.3,599 ప్లాన్
జియో రూ.3,599 ప్లాన్ కూడా ఉంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీంతో పాటు ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, డైలీ 2.5 GB డేటా, రోజుకు 100 SMSల ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే Jio Five వినియోగదారులకు అపరిమిత డేటా అందించబడుతుంది. అలాగే Jio యాప్‌లను ఫ్రీగా వాడుకోవచ్చు.