/rtv/media/media_files/2025/07/27/social-media-reels-2025-07-27-08-14-17.jpg)
Social media reels
Reels : జనాలు సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి ఎంతకైన తెగిస్తున్నారు. పరిసరాలను మరిచిపోయి కొందరు ప్రవర్తిస్తుంటే, చట్టాలను ఉల్లంఘిస్తూ అశ్లీల నృత్యాలతో సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు. నలుగురు చూస్తున్నారన్న భయం లేకుండా బరితెగిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ఆడవారిలా చీరకట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చిందులు వేస్తూ రెచ్చిపోయాడు. పబ్లిక్‌లో సిగ్గులేకుండా ప్రవర్తించాడు. అంతేకాదు పోలీస్ అధికారి ముందు కూడా అలాగే చిందులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. నోయిడాలోని రాష్ట్రీయ దళిత్ ప్రేర్నా స్థల్ దగ్గర నీరజ్ అనే యువకుడు "మై హు దుల్హన్ ఏక్ రాత్‌కీ’ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ పోలీసు చుట్టూ తిరుగుతూ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను వేస్తున్న చిల్లర చిందులకు పోలీస్ ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాడు.
🚨नोएडा : युवक ने पुलिसकर्मी के साथ बनाई अश्लील रील🚨
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 26, 2025
🆔 महिला के कपड़े पहनकर युवक का अश्लील नृत्य
🕵️♂️ लोगों ने शिकायत कर कार्रवाई की मांग
📍 सेक्टर-95 स्थित दलित प्रेरणा स्थल का वीडियो
📍 वीडियो वायरल, पुलिस युवक की पहचान में जुटी#Noida#ObsceneReel#ViralVideo#PoliceAction… pic.twitter.com/TP7usj0bCF
Also Read: 'I Love You' చెప్పడం లైంగిక వేధింపు కాదు.. కోర్టు సంచలన తీర్పు
మరో వీడియోలో ‘సయ్యాజి దిల్‌వా మిలేంగే..’ అనే భోజ్‌పురి పాటకు కూడా అలాగే అసభ్యకరంగా డ్యాన్స్ చేశాడు. ఇంకా ఈ వీడియోలో నీరజ్ తో పాటు మరో ఇద్దరు యువతులు కూడా మరో యువకుడు కూడా డ్యాన్స్ చేయడం గమనార్హం. నోయిడాలో ఈ వీడియోలు చిత్రీకరించారు. అయితే నీరజ్ పోలీస్ ముందు చేసిన డ్యాన్స్ వీడియో పోలీసు ఉన్నతాధి కారుల దృష్టికి వెళ్లింది. వీడియోపై పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు.సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Also Read: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు
కాగా వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచే విధంగా.. అసభ్యకరంగా ఏది చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు..‘అలా పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే వారిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి’.. ఛీ..ఛీ...మరి సిగ్గులేకుండా తయారయ్యారంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ లింక్ ఒక్కో సమయంలో ఓపెన్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.