Thailand-Cambodia: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు

పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. ఇరు దేశాలూ చర్చలకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. 

New Update
Trump

Trump

మూడు రోజుల నుంచి ధాయ్ లాండ్, కాంబోడియా సరిహద్దుల్లో మారణహోమం నడుస్తోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పటి వరకు 33 మంది చనిపోగా..లక్షా 68 వేల మంది నిరాశ్రయులయ్యారు. రెండు రోజుల క్రితం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌లాండ్‌ సైనికులు గాయాలపాలు కావడం ఈ గొడవ మొదలైంది. మరోవైపు కంబోడియాలో కూడా 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్‌ ఫియాక్ట్రా వెల్లడించారు.

Truth
Trump Social Media Truth

శాంతి చర్చలకు అంగీకారం..

కాంబోడియా, థాయ్ లాండ్ లు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడి జోక్యంతో ఈ రెండు దేశాలూ శాంతి చర్చలకు ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం స్కాట్ లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ తాను కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్,  థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో విడివిడిగా మాట్లాడానని, పోరాటం కొనసాగించడం వల్ల అమెరికా వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరు నాయకులను హెచ్చరించానని అన్నారు. దీంతో రెండు దేశాలూ చర్చలకు అంగీకరించాయని చెప్పారు. వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి తాను అంగీకరించానని ట్రంప్ చెప్పారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. 

సరిహద్దులో ఆలయం కోసం గొడవ..

థాయిలాండ్,  కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఆలయం దగ్గర కాల్పుల తర్వాత ప్రారంభమైంది. దీని తర్వాత కంబోడియా సైనికులు థాయ్ సైనిక స్థావరం దగ్గరకు చేరుకున్న తర్వాత, రెండు సైన్యాల సైనికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. కంబోడియా సైనికులు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో థాయ్ సైనిక స్థావరాలపై దాడి చేశారు. కంబోడియా సైన్యం టా ముయెన్ థామ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని తర్వాత కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశ రాయబారిని థాయ్‌లాండ్‌ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది.

Also Read: BIG BREAKING: అమెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు

Advertisment
తాజా కథనాలు