SEBI: గౌతమ్‌ అదానీ తప్పు చేయలేదు.. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై సెబీ క్లీన్‌చిట్

రెండేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్‌ అనే అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ తీవ్ర ఆరోపణలు చేశారని ఓ రిపోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సెబీ గౌతమ్ అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

New Update
Sebi gives clean chit to Adani Group in Hindenburg case

Sebi gives clean chit to Adani Group in Hindenburg case

రెండేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautham Adani) పై హిండెన్‌బర్గ్‌(hindenberg-report) అనే అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ తీవ్ర ఆరోపణలు చేశారని ఓ రిపోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్స్‌కు సంబంధించి స్టాక్‌ అవకతవకలు, నిధులు మళ్లింపులు జరిగినట్లు వెల్లడించింది. అప్పట్లో ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. చివరికి మార్కెట్‌ నియంత్రణ సంస్థ(SEBI) దీనిపై దర్యాప్తు చేపట్టింది. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ గౌతమ్ అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. స్టాక్‌ అవకతవకలు, ఆకౌంటింగ్‌ మోసాలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. 

Also Read: కంగనాని చెంపదెబ్బ కొట్టాలి.. ప్రాణాలు పోతుంటే పైసలు రావట్లేదని ఆవేదనా!

SEBI Gives Clean Chit To Adani Group

అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీల్లో అక్రమంగా నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మార్కెట్‌ మ్యానిపులేషన్,అలాగే పబ్లిక్ షేర్‌ హోల్డింగ్‌ రూల్స్‌ ఉల్లంఘనకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలాఉండగా.. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్‌ గౌతమ్ అదానీ కంపెనీలకు సంబంధించి ఓ రిపోర్డును విడుదల చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 

Also Read: భారత్ పై ట్రంప్ యూటర్న్.. సుంకాల్లో భారీ మార్పులు.. కొత్త లెక్కలు ఇవే!

అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ లాంటి కంపెనీల్లో నిధులు మళ్లించడం కోసం  అడికార్ప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైల్‌స్టోన్‌ ట్రేడ్‌లింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలను అదానీ గ్రూప్‌ వాడుకున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల లావాదేవీల్లో ఈ రూల్స్ ఉల్లంధన జరగలేదని సెబీ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి రూల్స్‌ ఉల్లంఘన జరగలేదని తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థలు ఎలాంటి తప్పు చేయలేదని.. జరిమానా విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

Also read: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. నడిరోడ్డుపై బస్సు డ్రైవర్‌ను చితకబాదిన మహిళలు

Advertisment
తాజా కథనాలు