Watch Video: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. నడిరోడ్డుపై బస్సు డ్రైవర్‌ను చితకబాదిన మహిళలు

మహారాష్ట్రలో ఓ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు మహిళలు నడిరోడ్డుపైనే బస్సు డ్రైవర్‌ను చితకబాదారు. వాళ్లలో ఒకరి ఫోన్‌కు అశ్లీల వీడియోలు పంపిస్తున్నాడని ఆరోపిస్తూ చెంపదెబ్బలు వాయించారు.

New Update
Maharashtra Woman Tracks Down Bus Driver Who Sent Her Obscene Clips

Maharashtra Woman Tracks Down Bus Driver Who Sent Her Obscene Clips

మహారాష్ట్రలో ఓ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు మహిళలు నడిరోడ్డుపైనే బస్సు డ్రైవర్‌ను చితకబాదారు. వాళ్లలో ఒకరి ఫోన్‌కు అశ్లీల వీడియోలు పంపిస్తున్నాడని ఆరోపిస్తూ చెంపదెబ్బలు వాయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  ఇక వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్ జిల్లాకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం కంకవ్లిలోని ఓ ప్రైవెట్‌ ట్రావెల్‌ కంపెనీకి చెందిన బస్సు టికెట్‌ బుక్ చేసుకుంది. 

Also Read: రూ.50వేలకు సీపీఐ నేత కక్కుర్తి.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి!

Maharashtra Woman Tracks Down Bus Driver

అప్పటినుంచి తాను కంకవ్లి-ముంబై మధ్య ప్రయాణం చేయాల్సి వచ్చిన ప్రతిసారీ ఆ కంపెనీకి చెందిన బస్సు సర్వీసులనే వినియోగించుకుంది. ఇలా చాలాసార్లు ఆ బస్సులో ప్రయాణాలు చేసింది. దీంతో ఆమె కాంటాక్ట్ నెంబర్‌ అనేది ఆ కంపెనీ బుకింగ్‌ రికార్డ్స్‌లో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆ బస్సు డ్రైవర్‌.. బుకింగ్ రికార్డ్స్‌ నుంచి ఆమె నెంబర్‌ తీసుకున్నాడు. మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఆమెకు అశీల వీడియోలు పంపిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. 

ఆ మహిళ తనకు ఇలాంటివి పంపించకూడదని హెచ్చరించినా కూడా ఆ డ్రైవర్‌ మారలేదు. దీంతో బాధితురాలు సెప్టెంబర్‌ 16న సాయంత్రం మరో మహిళతో కలిసి కంకవ్లి బస్‌స్టాప్‌ దగ్గర్లో ఆ కంపెనీ బుకింగ్‌ కార్యాలయం వద్దకు వచ్చింది. అక్కడే ఆ డ్రైవర్‌ను కూడా గమనించింది. తనకు పంపిన మెసేజ్‌లు, వీడియోలు చూపిస్తూ అతడిని చితకబాదింది. మరో మహిళ కూడా ఆ డ్రైవర్‌ను కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు డ్రైవర్‌ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Also read: భారత్ పై ట్రంప్ యూటర్న్.. సుంకాల్లో భారీ మార్పులు.. కొత్త లెక్కలు ఇవే!

ఇదిలాఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కూడా మీరట్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చెంపలు వాయించింది. మహిళా పోలీస్ స్టేషన్ ముందే ఈ ఘటన జరిగింది. అంత రద్దీగా ఉండే రోడ్డుపై కూడా ఆ మహిళ తన భర్తను బహిరంగంగా కొట్టడం చూసి ప్రజలు అవాక్కైపోయారు. భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు