/rtv/media/media_files/2025/12/22/fotojet-2025-12-22-15-09-03.jpg)
Rohit Sharma
ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(rohit-sharma) కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్(Rohit Sharma Comments On His Retirement) చేశారు. వన్డే ప్రపంచకప్ 2023(one-day-world-cup) ఫైనల్‌లో ఓటమి తర్వాత రిటైర్ అయిపోదామనుకున్నానని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు. ’నేను తీవ్రంగా కుంగిపోయాను ఏకంగా క్రికెట్‌నే వదిలేద్దాం అనుకున్నా-, బ=ఓటమి నుంచి తిరిగి కోలుకోవడానికి 2నెలలు పట్టిందని రోహిత్ తెలిపారు.
ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేసిన రోహిత్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించడంతో ఇక ఈ అవమానాలు పడలేక రోహిత్ రిటైర్ అయిపోతాడనే అంతా భావించారు. కానీ రోహిత్ సైలెంట్ గా ఉన్నారు.
Also Read : అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే.. తేలిపోయిన టీమ్ ఇండియా
Rohit Goodbye To Cricket
అయితే ప్రస్తుతం వన్డే జట్టులో స్ధానం నిలబెట్టుకోవడానికి కూడా రోహిత్ శర్మ(rohith-sharma) అపసోపాలు పడుతున్నారు. ఏ క్షణమైన రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ వన్డే సిరీస్‌లోనూ జట్టులో చోటు కాపాడుకోవాలంటే... ఆడక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. మరోవైపు జట్టులో స్ధానం కావాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడి నిరూపించుకోవాలని బీసీసీఐ ఓవైపు ఉరుముతోంది. దీంతో దేశవాళీ క్రికెట్ ఆడి యువకులతో పోటీ పడలేక, అలాగని జాతీయ జట్టులో చోటు నిలబెట్టుకోలేకపోతున్న రోహిత్ రిటైర్మెంట్ పై చర్చ మరింత పెరుగుతోంది.
ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను గతంలోనే రిటైర్ అయిపోదామనుకున్నానని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత, తాను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యానని, క్రికెట్ తన నుంచి ప్రతిదీ లాగేసుకుందని, కాబట్టి తాను ఇకపై ఆడకూడదని, తన దగ్గర ఏమీ మిగిలి లేదని భావించానని మాస్టర్స్ యూనియన్ ఈవెంట్‌లో రోహిత్ వెల్లడించాడు. ఓటమి నుంచి తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని, ఇది తాను నిజంగా ఇష్టపడే విషయమని తెలిపాడు.
2023 వరల్డ్ కప్ ఓటమితో జట్టులో ప్రతి ఒక్కరూ చాలా నిరాశ చెందారని, ఏం జరిగిందో తాము నమ్మలేకపోయామన్నారు రోహిత్. 2022లో తాను కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రపంచ కప్ గెలవడంపైనే దృష్టి పెట్టానని గుర్తుచేసుకున్నాడు. తన ఏకైక లక్ష్యం ప్రపంచ కప్ గెలవడమని, అది T20 ప్రపంచ కప్ అయినా లేదా 2023 ప్రపంచ కప్ అయినా... కాబట్టి అది జరగనప్పుడు, తాను పూర్తిగా కుంగిపోయానన్నాడు. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించింది. ఆ తర్వాత హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ సారి 2027 వన్డే వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
Also Read : టాస్ వేయకుండానే.. నాలుగో టీ20 రద్దు..
Follow Us